ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ప్రభాస్..!

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు, ఆ క్రేజ్ ను అలానే  మెయింటెన్ చేసే ఉద్దేశంతో డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి విడుదల కూడా చేశాడు, అయితే ప్రస్తుతం ప్రభాస్ జిల్ పేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాదే శ్యామ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి.


ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇలా సినిమా పనులు చక చక జరిగిపోతున్న సందర్భంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాదే శ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ  ఈ సినిమాకు సీక్వెల్ ని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు అని, ఈ సినిమా తర్వాత ఆ సినిమా ను తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ ఈ సినిమా తో పాటు ఆది పురుష్, సలార్ సినిమా షూటింగ్ లను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ప్రభాస్ రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: