పుష్పక విమానం పై అంత క్రేజ్ ఉందా!!

P.Nishanth Kumar
ఆనంద దేవరకొండ హీరో గా తెరకెక్కిన మూడవ చిత్రం పుష్పకవిమానం. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఇటీవలే అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 12వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుండగా ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తుంది యూనిట్. కొత్త దర్శకుడితో ఆనంద్ దేవరకొండ స్వీయ నిర్మాణంలో చేస్తున్న ఈ చిత్రం ట్రైలర్ తోనే భారీ క్రేజ్ ను ఏర్పరుచుకుందని చెప్పవచ్చు. తొలి రెండు సినిమాలతోనే నటుడిగా తనను తాను నిరూపించుకుని హిట్స్ అందుకొని ఇప్పుడు మూడవ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు

ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉండగా ఆ అంచనాలకు తగ్గట్టుగానే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను యూనిట్ నిర్వహిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అల్లు అర్జున్ చేతుల మీదుగా జరగడం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో భారీ ఎత్తున నిర్వహించడం వంటి ఇ  ఈ సినిమా హిట్ అవుతుంది అని చె ప్పడానికి ముఖ్య కారణాలు . ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ కాగా అవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి అని చెప్పవచ్చు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రాలలో ఇది ఒకటి కాగా దీనికి ఆనంద్ సోదరుడు విజయ్ దేవరకొండ నిర్మాత కావడం విశేషం.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ 4 మిలియన్స్ మార్క్ ను అందుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారో తెలియజేస్తుంది. నవంబర్ 12వ తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా ఈ సినిమాను తిలకిద్దామా అన్నట్లుగా వారు ఎదురు చూస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించిన పుష్పకవిమానం సినిమా లాంటి క్లాసిక్ టైటిల్ ను ఈ సినిమా కు వాడడం ఇప్పుడు పెద్ద రిస్క్ అని చెప్పాలి. కానీ  ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా తప్పకుండా టైటిల్ గర్వించదగ్గ సినిమాగా మిగిలిపోతుందని అందరూ చెబుతుండడం విశేషం. భారీ తారాగణం నటించే ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: