ఆర్జీవీ వలలో మరో బిగ్ బాస్ లేడీ... త్వరలో ఇంటర్వ్యూ?

VAMSI
రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ మధ్య ఆయన విమర్శలతోనే ఎక్కువ పాపులయ్యారు. విషయం ఏదైనా ఆయన స్టైల్లో స్పందిస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ఇక ఈ మధ్య హాట్ బ్యూటీ లతో కొత్త కొత్త ఫోజులిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీస్ అరియాన మరియు అషు రెడ్డి లకు ఇంటర్వ్యూ లు ఇచ్చి సర్ప్రైజ్ చేసిన విభిన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇపుడు మరో బిగ్ బాస్ బ్యూటీ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒకే చెప్పారట. ఓ ప్రముఖ మీడియా తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ అయిన లహరికి రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ ఆఫర్ ఇవ్వగా.. ఆమె సరే అన్నట్లు సమాచారం.

ఇప్పటికే ఇంటర్వ్యూ డేట్ కూడా ఫిక్స్ చేశారని, త్వరలోనే ఆ ఇంటర్వ్యూ వీడియోలు మన ముందుకు రాబోతున్నాయి అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్త ఇపుడు ప్రస్తుతం వైరల్ గా మారింది. వర్మతో బ్యూటీ ఇంటర్వ్యూ అంటే మాటలా....బాబోయ్ ఈయన అన్ని డైరెక్ట్ గానే ఓపెన్ అయిపోతారు. అనిపించింది అనిపించినట్లు మనసులోని మాటను బయటకు చెప్పేస్తారు. గతంలో బిగ్ బాస్ లేడీ అరియనా తో జిమ్ లో ఇంటర్వ్యూ సమయం లో రచ్చ రచ్చ చేసిన ఆర్జివి ఆ తర్వాత అషు రెడ్డి తో ఇంటర్వ్యూ లో కూడా అంతకు మించిన అల్లరి చేశారు.

ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ వారి అందాలను అభివర్ణిస్తూ మనసులోని భావాలను నిర్మొహమాటంగా బయట పెట్టేసారు. అషుతో ఇంటర్వ్యూ సమయంలో అయితే ఒకానొక సందర్భంలో తన కాళ్ళు తాకి నువ్వు నిజంగా చాలా తెలివైన అమ్మాయి నా దృష్టిలో దేవతలతో సమానం అంటూ అషుని మాటల్లో పెట్టాడు. అలా అషూ, అరియానా లతో బోల్డ్ ఇంటర్వ్యూలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆర్జీవి ఇక ఇప్పుడు లహరితో ఇంటర్వ్యూ అంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారో అని అంటున్నారు. కాగా ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: