విజయ్ దేవరకొండ లో వచ్చిన ఈ మార్పు చూశారా!!

P.Nishanth Kumar
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.

అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ గ్యాప్ రావడం వల్ల ఆయన నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న సినిమా అయినా పుష్పక విమానం యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం నవంబర్ 12వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతున్న గా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ తో కలిసి హాజరై చిత్ర విశేషాలను పంచుకున్నాడు. అలాగే తన యొక్క సినిమా విశేషాలను కూడా చెప్పాడు. అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి ఆయన గొప్పతనాన్ని గురించి కూడా వెల్లడించాడు విజయ్ దేవరకొండ.

అయితే ఈ సినిమా ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన తీరును చూసి ప్రతి ఒక్కరు ఎంతగానో ఆశ్చర్యపోయారు. గతంలో ఎప్పుడూ లేని బాధ్యత ప్రవర్తన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన స్పీచ్ లో కనిపించిందని అందరూ చెబుతున్నారు. గతంలో ఆయన మాట్లాడితే ఎంతో సెన్సేషన్ నిండి ఉండేది. ఎంతో విమర్శించే విధంగా ఆయన మాటలు ఉండేవి కానీ ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట లో నీతి నిజాయితీ ఉండడంతో పాటు నిబద్ధత క్రమశిక్షణ బాధ్యత వంటివి కూడా ఉంటుంది. అల్లు అర్జున్ గురించి అలాగే పునీత్ రాజ్ కమార్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. అలా రౌడీ విజయ్ దేవరకొండ తన ప్రవర్తన లో మార్పు ను మాటల ద్వారా చూపించాడని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: