శ్రుతి హాసన్ కి మరో బంపర్ ఆఫర్!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతుంది హీరోయిన్ శృతిహాసన్. ఆమె ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతకు ముందు క్రాక్ సినిమాతో మంచి హిట్ ఇచ్చి తన డిమాండ్ ను మరింత పెంచుకుంది. కమల్ హాసన్ కూతురుగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆమె తన గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. తొలి సినిమా నుంచి గ్లామర్ కు ఏ మాత్రం అడ్డు చెప్పకుండా అందాలను చూపిస్తూ ప్రేక్షకులను కోట్లాది మంది అభిమానులు గా చేసేసుకుంది.

తమిళ తెలుగు మలయాళ సినిమా పరిశ్రమలోనే కాకుండా హిందీలో సైతం ఈమె సినిమాలు చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే మొదటి నుంచి ఆమె సినిమా కెరియర్ కాస్త అస్తవ్యస్తంగా ఉందని చెప్పవచ్చు. హిట్ కొట్టిన ప్రతిసారి ఆమె చాలా గ్యాప్ తీసుకొని మరీ తన తదుపరి సినిమా చేసేది. దానికి తోడు ఆమె కొన్ని వివాదాల్లోకి వెళ్లడం, ప్రేమ లో విఫలం కావడం వంటివి ఆమెను డిస్టర్బ్ చేశాయి. దాంతో తెలుగులో సినిమాలకు ఆమె దాదాపుగా దూరమైపోయింది అనే వార్తలు వినపడ్డాయి. కానీ అనూహ్యంగా రవితేజ హీరోగా నటించిన చిత్రం తో హిట్ కొట్టి మంచి కం బ్యాక్ చేసి మళ్ళీ హీరోయిన్ గా సినిమాలు చేయడం మొదలుపెడుతుంది.

ఈ నేపథ్యంలోనే ఆమె సలార్ సినిమాతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలను ఒప్పుకునే విధంగా అడుగులు వేస్తుంది. గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా శృతిని ఎంపిక చేసారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ శృతిహాసన్ అనుకుంటున్నారట. మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలలో చేస్తున్నారు. మొదటి గా గాడ్ ఫాదర్ సినిమా వస్తుండగ ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మరొకటి భోళా శంకర్.  ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: