పునీత్ రాజ్ కుమార్ పై పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు...

VAMSI
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త ఒక్కసారిగా అటు కర్ణాటక, ఇటు తెలుగు రాష్ట్రాలలో అల్లక్లలోలం సృష్టించింది. నమ్మశక్యం కాని ఈ వార్త ఎవరికీ మింగుడుపడటంలేదు. ఇప్పటికే పలువురు కన్నడిగులు తమ కన్నడ పవర్ స్టార్ ఇక లేరని తెలిసి ప్రాణాలను సైతం కోల్పోయారు. మరి కొందరు తిండి నిద్రలు మాని దుఃఖసముద్రంలో మునిగిపోయారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులను కన్నీటి సునామీలో ముంచేసింది ఈ వార్త. పునీత్ రాజ్ కుమార్ ఇంత చిన్న వయస్సులోనే మనలందిరిని విడిచి వెళ్లిపోవడం అస్సలు భరించలేని విషాదం. అయితే పునీత్ గురించి "నమ్మ బసవ" మూవీ దర్శకుడు, నిర్మాత అయినటువంటి వీర శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే పలు సంచలన విహసయాలు తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ ఒక గొప్ప నటుడే కాదు అంతకుమించి గొప్ప మనసున్న మనిషి కూడా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గౌరవమిచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడుతారు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "గుడుంబా శంకర్" సినిమా చేస్తున్నప్పుడు...వేరే వాళ్ళతో నాకు ఒక కబురు పంపాడు. తనతో ఒక సినిమా తీయొచ్చు కదా అని..నాకు కన్నడ బాగా వచ్చు, అది కాక స్టార్ హీరో అలా అడగడంతో  నేను వెంటనే సరే అన్నాను. దాంతో పునీత్ చాలా సంతోషించారు. అలా "నమ్మ బసవ" సినిమా స్టార్ట్ చేశాం. ఆ సమయంలో మా సినిమాని నిర్మిస్తామని చాలా మంది కన్నడ పెద్ద నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ నేనే నిర్మాతగా ఉందన అని అడుగగానే .. వెంటనే వై నాట్ సార్ అంటూ ఒప్పేసుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.

అలా నేను నిర్మాతగా మారడానికి కారణం అయ్యాడు పునీత్.  నెక్స్ట్ నేను వెళ్లి కథ వినిపించాను. ఆ సమయంలో  పునీత్ రాజ్ కుమార్ తో పాటు అయన అన్నగారు రాఘవేంద్ర రావు గారు, వరదండ గారు ఉన్నారు. కథ వినగానే ముగ్గురు హగ్ ఇచ్చి ఒకే చెప్పారు. నిజానికి పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. జిమ్నాస్టిక్ లో తను ఛాంపియన్,  ఫిట్నెస్ ను ఫర్ ఫెక్ట్ గా మెయింటెన్ చేస్తాడు, స్ప్రింగ్ లాంటి బాడీ తనది.. నమ్మ బసవ సినిమా చిత్రీకరణ సమయంలో ఎంత రిస్కీ ఫైట్స్ ఉన్నా కూడా అసలు డూప్ చేయకుండా ఫైట్స్ చేశారు. అస్సలు వేరే హీరోలతో అది సాధ్యంకాని పని అంటూ పునీత్ పట్టుదలను, సినిమ పై ఉన్న అంకితభావాన్ని తెలియచేశారు.  అలాంటిది ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. నాకు జీవితాన్నిచ్చింది పునీత్ రాక్ కుమార్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: