బాలయ్య షోలో మాన్షన్ హౌస్.. ఫ్యాన్స్ షాక్?
అంతేకాదండోయ్ ఓటిటీలో సరికొత్త షోలు నిర్వహిస్తూ ఉండగా స్టార్ హీరోలు హోస్టులుగా కూడా మారిపోతున్నారు. ఇకపోతే ఇటీవల ఎవరూ ఊహించని విధంగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఏకంగా ఓటిటీలో ఒక టాక్ షో చేయడానికి సిద్ధమవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు ఓటిటీ ఆహా ప్రస్తుతం భిన్నమైన కంటెంట్తో ఎంతో మందిని ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆన్ స్టాపబుల్ అనే షోను ప్లాన్ చేసింది ఆహా. ఇక ఈ షోలో భాగంగా పలువురు సెలబ్రిటీల ను పిలిచి వారితో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నాడు.
ఇకపోతే ఈ టాక్ షో ఫై భారీగానే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ షో కి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయింది. ఈ ప్రోమోలో అటు బాలయ్య చెప్పిన పంచ్ డైలాగులు అయితే అభిమానులందరికీ కూడా పూనకాలు తెప్పించాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ప్రోమో గమనిస్తే స్పాన్సర్స్ లో మాన్షన్ హౌస్ పేరు ఉంది. అయితే మాన్షన్ హౌస్ కి బాలయ్య బాబు కి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఏకంగా బాలయ్య నిర్వహిస్తున్న టాక్ షో కి స్పాన్సర్గా మ్యాన్షన్ హౌస్ ఉండడంతో ఇక ప్రస్తుతం ఈ ప్రోమోని అందరూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇక ఈ ప్రోమో పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ప్రత్యక్షమవుతున్నాయి. కాగా ఈ షోకి మొదట మంచు కుటుంబం అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కాబోతుంది.