త్రిషకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఛాన్స్?

VAMSI
తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది త్రిష. చిరంజీవితో `స్టాలిన్‌`, వెంకటేష్‌తో `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, నమో వెంకటేశా, నాగార్జునతో కింగ్‌, బాలకృష్ణతో లయన్‌, పవన్‌తో తీన్‌మార్‌,  ప్రభాస్‌తో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు. మహేష్‌తో అతడు, సైనికుడు, గోపీచంద్‌తో శంఖం,  ఎన్టీఆర్‌తో దమ్ము, రవితేజతో `క్రిష్ణ`, నితిన్‌తో `అల్లరి బుల్లోడు` వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించింది. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన త్రిష అబ్బుర పరచే నటనతో, అందంతో అశేష అభిమాన ఘనాన్ని సంపాదించుకుంది. ఈమె మాతృ బాష తమిళం అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ గుర్తింపు పొందింది. అయితే గత కొంత కాలంగా తెలుగులో పెద్దగా చిత్రాలు చేయడం లేదు.

తమిళ ఇండస్ట్రీ లోనే వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. అయితే టాలీవుడ్ లో సినిమాలు చేసి ఇంత కాలం అయినా ఇక్కడ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. త్రిష కోసం ఇప్పటికీ తమిళ సినిమాలను అదే పనిగా చూసే అభిమానులు ఎందరో ఇదిలా ఉండగా తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ త్రిషను తెలుగు సినిమాకి సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. త్రిష కూడా ఇప్పటికే కథ విని డేట్స్ కూడా ఇచ్చారని సమాచారం. ఇదో లేడీ ఓరియెంటెడ్ కథ అని టాక్. ప్రస్తుతం త్రిష తమిళంలో  ‘పొన్నియిన్‌ సెల్వన్‌’  అనే చిత్రం తో బిజీగా ఉండగా...తెలుగులో మళ్ళీ కనిపించాలనే ఆకాంక్ష తోనే డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరీ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఏదేమైనా ఇదే కనుక వాస్తవమైతే త్రిష తెలుగు అభిమానులకు ఇక పండగే పండగ. త్రిష మళ్ళీ తెలుగు లో రాణించాలని అంతా కోరుకుందాం. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లు రీ ఎంట్రీ తో దుమ్ము లేపుతున్నారు. అదే విధంగా త్రిష కూడా తెలుగులో మళ్ళీ ట్రెండ్ సృష్టిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: