బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీ హిట్టేనా?
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు.. భారీ రేంజిలో అంచనాలు కూడా పెరిగి పోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్లో అఖండ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ టీజర్ చూస్తే బాలకృష్ణ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. అయితే ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో హీరో శ్రీకాంత్ కూడా అఖండ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు బాలకృష్ణ తన కెరియర్ లో పోషించని అఘోరా పాత్రలో నటిస్తుండడం ఇక భారీ రేంజ్లో ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. సాధారణంగానే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటే పవర్ ఫుల్ పంచ్ డైలాగులు..యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మరి బాలకృష్ణుని సరికొత్తగా అఘోర పాత్రలో బోయపాటి చూపించబోతున్నాడు. ఈ పాత్ర ఎలా ఉండబోతోంది అనే దానిపై మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతూంది.