పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఓ టీ టీ లో విడుదల అవుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. సాగర్ చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచయితగా చేస్తున్న ఈ సినిమా లో రానా మరో హీరోగా నటిస్తుండటం విశేషం. నిత్యా మీనన్ మరియు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ లు గా నటిస్తుండగా ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తపరుస్తున్నారు చిత్ర బృందం.
ఇప్పటికే ఈ సినిమా రెండు పాటలను విడుదల చేయగా త్వరలోనే ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. హీరోల ఇద్దరి టీజర్ ను విడుదల చేసిన యూనిట్ ఇద్దరు కలిసి ఉన్న మరొక పవర్ ఫుల్ టీజర్ ను విడుదల చేయబోతుంది. ఆ విధంగా సినిమాపై అంచనాలు పెంచే మంచి మంచి అప్డేట్లు ఇస్తూ క్రేజ్ ను పెంచుతుంది యూనిట్. ఇకపోతే భీమ్లా నాయక్ సినిమా విడుదల విషయం లో పవన్ అభిమానులకు సందేహం ఉంది అని చెప్పవచ్చు.
దానికి కారణం ఈ సినిమాకు సంబంధించిన విడుదల ఎలా ఉంటుంది అన్న క్లారిటీ లేకపోవడమే. ఈ సినిమా కు ఎంతైనా ఇచ్చి ఓ టీ టీ హక్కులు చేజిక్కించుకోవాలని లక్ష్యంతో ఉన్నాయి సదరు సంస్థలు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తమ సినిమాలను దియేటర్లలో విడుదల చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారట. ఆ విధంగా ఈ సినిమా ఓ టీ టీ విడుదల కాదని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ మరొక మూడు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తి చేశాడు. భవదీయుడు భగవద్గీత అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయాల్సి ఉంది.