నా పెళ్లి అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్?
ఇప్పుడు వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో నాగ శౌర్య నటించిన వరుడు కావలెను సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి టీజర్ ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇది స్వచ్ఛమైన ప్రేమ కథ భావోద్వేగాలు ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ ఉంటాయి అంటూ తెలిపింది. ఈనెల 29వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ఈ అమ్మడు తన పెళ్లి గురించి కూడా ఓపెన్ అయింది.
పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడైతే లేదని అయితే ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి విషయాన్ని నాకే వదిలేశారు అంటూ తెలిపింది రీతూ వర్మ. అయితే మరో రెండు మూడేళ్ల తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ తెలిపింది. ఇప్పుడూ తన దృష్టి మొత్తం తన కెరీర్ పైనే ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే తనకు డాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఇప్పటివరకు డాన్స్ చేసే సాంగ్స్ మాత్రం తనకు రాలేదు అంటూ చెప్పింది. కానీ ఇక వరుడు కావలెను అనే సినిమాలో మాత్రం దిగు దిగు అనే ఒక మాస్ సాంగ్ లో డాన్స్ చేసే అవకాశం వచ్చినట్లు తెలిపారు. ఇక శర్వానంద్ తో ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్నాను. తమిళంలో కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది రీతు వర్మ.