పెళ్లిలో క‌లిసిన‌ మెగా బ్రదర్స్‌.. ?

Veldandi Saikiran
మెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరి సినిమాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు... ఎగబడి చూస్తారు. అదే ఇద్దరూ ఒకేసారి ఎక్కడైనా కనిపిస్తే అభిమానుల్లో... కొత్త ఉత్సాహం... వస్తుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఓ పెళ్లి వేడుకలో కనిపించి అందరినీ అలరించారు. మాజీమంత్రి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్ రామ్ పెళ్లి రిసెప్షన్ నిన్న రాత్రి హైదరాబాదు లో నిర్వహించారు. అయితే తే.గీ వెంకటరామ్ మ్యారేజ్ రిసెప్షన్ కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి మరియు  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 

అయితే ఈ ఫంక్షన్ కు వచ్చిన.. ఇద్దరు మెగా హీరోలు నవ్వుతూ అందరినీ పలకరించడం... ఆ పెళ్లి రిసెప్షన్ లోనే హైలెట్ గా నిలిచింది. ఇంకా మెగా బ్రదర్స్ రాకతో ఆ ఫంక్షన్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఫంక్షన్ కు విచ్చేసిన అనంతరం ఇద్దరూ మెగా హీరోలు కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి... ఆ కుటుంబ సభ్యులతో... ఫోటోలు దిగారు. అయితే ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

బిమ్ల నాయక్, హరిహర వీరమల్లు లాంటి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అటు ఆచార్య మరియు గాడ్ ఫాదర్ లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదిలా ఉండగా... ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్... రాజకీయాల పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ తీసుకున్న ఆన్లైన్ టికెట్ విధానానికి వ్యతిరేకంగా... ఇటీవల తీవ్రస్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే.  అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల పరిస్థితులపై మరియు ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ మధ్య  ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: