' భీమ్లా నాయ‌క్‌ ' కు క‌ళ్లు చెదిరే ఓటీటీ ఆఫ‌ర్‌.. అన్ని కోట్లా..!

VUYYURU SUBHASH
ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో భీమ్లా నాయక్ సినిమా తెర‌కెక్కు తోంది. మ‌ల్లూవుడ్ సూప‌ర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు ఈ భీమ్లా నాయ‌క్‌ తెలుగు రీమేక్. ఇందులో పవన్ క‌ళ్యాణ్ ప‌క్క‌న నిత్యా మీనన్ , రానా కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్లు గా న‌టిస్తున్నా రు. ఆల్రెడీ హిట్ అయిన రీమేక్ సినిమా అయినా కూడా ప‌వ‌న్ - రానా కాంబినేష‌న్ కావ‌డంతో తెలుగులో ఈ సినిమాకు భారీ హైప్ వ‌చ్చింది.

ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా 2022 జనవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఇద్ద‌రు హీరోల ఫ‌స్ట్ లుక్ తో పాటు ఇంట్రో టీజ‌ర్లు రిలీజ్ అయ్యి విశేషంగా ఆక‌ట్టు కుంటున్నాయి. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర్చిన టైటిల్ సాంగ్ తో పాటు మ‌రో పాటకు కూడా మంచి టాక్ వ‌చ్చింది. ఈ సినిమా ఓటీ టీ రిలీజ్ చేస్తే అదిరిపోయే రేటు ఇచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ  రెడీగా ఉందని టాక్ వినిపిస్తోంది.

థియేట‌ర్ రిలీజ్ కాకుండా.. ఓటీ టీకి ఇస్తే రు. 150 కోట్లు ఇస్తామ‌ని అమోజాన్ ఆఫ‌ర్ చేసిన‌ట్టు టాక్ ?  ఈ సినిమా ను థియేట‌ర్ల లో రిలీజ్ చేస్తే హిట్ టాక్ వ‌స్తే రు. 100 కోట్ల షేర్ సులువుగా వ‌సూలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా రు. 150 కోట్ల ఓటీ టీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్న వార్త‌ల‌తో ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సంక్రాంతికే థియేటర్ల‌లో ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌స్తుంది.

మ‌రి ఈ సినిమా కు పోటీ గా భీమ్లా నాయ‌క్ ను రిలీజ్ చేస్తున్నారు. మ‌రి భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ డేట్ మారుస్తారా ?  లేదా ఓటీటీకి వెళ‌తారా ? అన్న‌ది చూడాలి. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే,  మాటలు అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: