పని మనిషికి ప్రభాస్ ఫ్యామిలీ సన్మానం.. ఎందుకో తెలుసా..?

Anilkumar
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన చేసే మర్యాదల గురించి ఎవరిని అడిగినా చెబుతారు. ఇక కృష్ణం రాజు గారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ పెద్దలు వారి ఇంట్లో ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే మర్యాదలు అలా ఉంటాయి మరి. ఇక కృష్ణంరాజు నట వారసుడిగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా ఈ అలవాటు ఉంది. సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మందికి ప్రభాస్ సపోర్ట్ చేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ గొప్పతనం గురించి ఎంతో మంది నటీనటులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. 

ఇక చాలా మంది సెలబ్రెటీలు డార్లింగ్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు అంటూ సరదాగా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇంటికి వచ్చే అతిథులనే అంత బాగా చూసుకుంటే.. ఇక ఇంట్లో పని చేసే వాళ్ళని ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.తమ ఇంట్లో పని చేసే వాళ్ళని తమ సొంత మనిషిలా చూసుకుంటారు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. కృష్ణంరాజు ఇంట్లో పాతికేళ్లుగా పద్మ అనే ఆవిడ పనిచేస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా తన బాగోగులు చూసుకుంటూ ఎంతో నమ్మకంగా ఉన్న పద్మ.. తమ ఇంట్లో పని చేయడం మొదలుపెట్టి దాదాపు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని కృష్ణరాజు ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.

'25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్' అంటూ ఏకంగా ఆమె చేత కేక్ కట్ చేయించి.. ఆమెకి కృతజ్ఞతలు తెలిపారు కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ. ఇక వారి ఇంట్లో పని చేసే పద్మ వారి ఆశీర్వాదం తీసుకున్నారు.ఇక కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పద్మకు గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ నెటిజన్లు సైతం షాక్ కి గురవుతున్నారు. ఇంట్లో పని వాళ్ళని కూడా ఎంతో ప్రేమగా సొంత వాళ్లలాగా చూసుకుంటున్నారని.. కృష్ణంరాజు దంపతులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా కృష్ణంరాజు ఫ్యామిలీ అతిథులకు చేసే మర్యాదలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: