మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాదులోని కేబుల్ బ్రిడ్జి పై బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురైన తేజు.. దాదాపు 35 రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకొని ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తేజు పూర్తిగా కోలుకుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే తేజు హెల్త్ అప్డేట్ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా సపరేట్గా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటిదాకా మాత్రం తేజు ఫోటో ఇంతవరకు బయటికి రాలేదు.
తాను బాగున్నాను అంటూ అప్డేట్ ఇస్తూ..
థమ్సప్ సింబల్ ని మాత్రమే చూపించడం ఇప్పుడు అందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. తేజు ఎందుకని తన మొఖాన్ని చూపించడం లేదు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. తేజు ముఖానికి దెబ్బలు తగిలాయని.. అది నయం అవడానికి కాస్త సమయం పడుతుందని.. కాబట్టి పూర్తిగా పాత రూపం వచ్చే వరకూ ఫోటోలలో తన ముఖాన్ని తేజ్ చూపించడం లేదని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియడం లేదు. మరి ఆ కుటుంబానికి చెందిన ఎవరైనా ఈ విషయంపై క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
లేకపోతే అప్పటిదాకా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ప్రచారం అవుతూనే ఉంటాయి. ఇక ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సాయిధరమ్ తేజ్ ను కలిశాడు. ఇక తేజ్ ను కలిసి ఎన్నో ముచ్చట్లు పెట్టానని హరిశంకర్ అన్నాడు. అంతేకాకుండా త్వరలోనే తేజు రాబోతున్నాడు.. కుమ్మేసాడు..అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ఓ ఫోటోను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు హరీష్ శంకర్. ఇందులో తేజు మొహాన్ని మాత్రం చూపించలేదు. చేతిలో చేయి వేసి భరోసా ఇచ్చినట్లుగా పరోక్షంగా చెప్పాడు. ఇక మరోవైపు మెగా అభిమానులు తేజు త్వరగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్ లో జాయిన్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు...!!