జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన ఈ స్టార్ హీరోయిన్స్..?

VUYYURU SUBHASH
అమ్మ..రెండంటే రెండు అక్షరాలే.. కానీ అలా పిలిపించుకొవడానికి ఆమె పడే బాధ ఎన్ని జన్మలైనా మరువలేనిది. తనకు ఏమైనా పర్వాలేదు అంటూ కడుపులోని బిడ్డకు జన్మ నివ్వడానికి భరించలేని నొప్పిని భరించేదే అమ్మ. చాలా మంది అంటుంటారు ఆడదాని జీవితానికి అసలైన అర్ధం వచ్చేది..అమ్మ అయిన్నప్పుడే అని. అందుకే ఆడదానికి సాకారం అమ్మతనం అంటుంటారు మన పెద్దవాళ్లు. అయితే, కొందరు ఆడవాళ్లకు అమ్మ అని పిలిపించుకునే అవకాశం లేకుండా పోతుంది. వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల కొందరు తల్లి కాలేకపోతే.. మరికొందరు ఏమో తమ అందం చెడ్డిపోతుందని.. మరి కొందరు తల్లి అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయి అని ..ఇలా చాలా మంది హీరోయిన్లు పిల్లల విషయంలో సరిదిద్దుకోలేని తప్పులు చేసారు. ప్రజెంట్ గురించి ఆలోచించి..భవిష్యత్తుల్లో బిడ్డలు లేకుండా బాధ పడుతున్న ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం రండి..!!
శారద: టాలీవుడ్ లో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న ఈమె చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి..తన అందంతో పాటు తనదైన యాక్టింగ్ స్టైల్ తో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఈమె తనకు 22 సంవత్సరాలు ఉన్నప్పుడు చలం అనే సహ నటుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా శారద సినిమాల్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఆ టైంలో పిల్లలు గురించి ఆలోచించలేదు. ఆ తరువాత ఆలోచించిన ఉపయోగం లేకుండా పోయింది.
జయప్రద: తన కళ్లతోనే ఎటువంటి ఎక్స్ ప్రేషన్స్ ని అయినా పండించే ఈ భామ అతి  చిన్న వయసులోనే సినిమా స్టార్  ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మెహతాను పెళ్లి చేసుకుంది. కానీ ఎంత త్వరగా పెళ్లి చేసుకుందో అంతే త్వరగా విడాకులు తీసేసుకుంది. ఇంకా పిల్లలను కనే ఛాన్స్ లేకుండాపోయింది. ఇప్పుడు రాజకీయాలో తనదైన స్టైల్లో చక్రం తిప్పుతుంది.
రేవతి: ఒక్కప్పుడు తన అంద చందాలతో కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన ఈ సీనియర్ హీరోయిన్.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించడమే కాకుండా..తన నటనకు మంచి మార్కులు కూడా వేయ్యించుకుంది.  తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే డైరెక్టర్ సురేష్ చంద్ర మీనన్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈమెకు.. పిల్లలు లేరు. పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుందని..బాడీలో మార్పులు వస్తే హీరోయిన్ గా అవకాశాలు రావు అని పిల్లల్ని కనలేదు.  తీరా పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఆ దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వలేదు.
విజయశాంతి: లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేడీ ఓరియంటేడ్ సినిమాలకు పెట్టింది పేరు ఈమె. ఒక్కప్పుడు ఈమె సినిమా వస్తున్నాయంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వాళ్ల సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకునే వాళ్లు. ఇక ఈమె కూడా అమ్మ అనే పిలుపుకు నోచుకోలేదు.  శ్రీనివాస్ ప్రసాద్ ను పెళ్లి చేసుకున్న తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఈ భామ.. పిల్లల్ని కనే ప్రయత్నం చేయలేదు. ఎవరైనా అడిగితే తనకు సమాజమే పిల్లలు అని అంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: