అజయ్ భూపతి.. వామ్మో నీలో ఇంత కసి ఉందా భయ్యా!!

P.Nishanth Kumar
ఎవరైనా ప్రాణం పెట్టి సినిమా చేస్తే సినిమాపై నమ్మకం పెట్టుకుని సినిమా చేస్తే తప్పకుండా ఆ సినిమా దర్శకుడిని మోసం చేయదు అని చెప్పడానికి మహాసముద్రం సినిమా నే ఉదాహరణ.  ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు గా తానేంటో ని రూపించుకున్నాడు అజయ్ భూపతి. ఆ సినిమా ఒకే ఒక ట్విస్ట్ తో భారీ స్థాయిలో హిట్ అవగలిగింది. తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో ఎప్పుడూ రాని ట్విస్ట్ కాబట్టి దాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు.

భవిష్యత్తులో కూడా అలాంటి ఎమోషన్స్ ఉన్న పాత్రను ఎవ రు డిజైన్ చేయలేరు కాబట్టి ఆ సినిమా హీరో పాత్రకు అందరూ కనెక్ట్ అయ్యారు. ఏదేమైనా తారస్థాయి ఎమోషన్ త న మొదటి సినిమాలోనే పలికించి దర్శకుడిగా తొలి సినిమాతోనే గొప్ప పేరు సంపాదించుకున్నాడు అజయ్ భూపతి. ఆయనలో ఉన్న కసి తొలి సినిమాలోనే అందరికీ పరిచయం అయ్యింది. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఎన్నో చేసి ప్రేక్షకులను అలరిస్తానని చెప్పడమే కాకుండా తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమా లను కూడా చేస్తాను అని చాటి చెప్పాడు.

ఆయన చెప్పినట్లుగానే మహా సముద్రం సిని మా కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా పోస్టర్లు దగ్గర నుంచి ఇప్పటివరకు అన్ని పాజిటివ్ వైబ్స్ ఏర్పడే విధంగా ఉన్నాయి. ఎక్కడ నెగిటివ్ అనేది ఈ సినిమా విషయంలో కనపడలేదు. మరొకసారి శర్వానంద్, సిద్ధార్థ్ లు తమ నటనతో ప్రేక్షకులను అలరించ గా వారందరి కంటే ఎక్కువ గా తన దర్శకత్వం తో అలరించాడు అజయ్ భూపతి అ ని చెప్పవచ్చు. ఈ సినిమాతో తన లో కసి ఎంత ఉందో చెప్పి వరుసగా రెండో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకు ని ద్వితీయ విఘ్నం దాటేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: