కళా'మాతల్లి : "మా" అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన విష్ణు..!

NAGARJUNA NAKKA
వివాదాలు, విమర్శల మధ్యే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంచు విష్ణు.. నేడు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ నుంచి విష్ణు బాధ్యతలు స్వీకరించాడు. అలాగే  వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివబాలాజీ బాధ్యతలు స్వీకరించారు. వృద్ధ ఆర్టిస్టులకు పెన్షన్ల ఫైళ్లపై తొలి సంతకం చేశాడు మంచు విష్ణు.

మా ఎన్నికలు ముగిసినా.. రోజుకో ట్విస్ట్స్ తెరమీదకు వస్తోంది. ఓటమి తర్వాత.. ప్రకాశ్ రాజ్ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. తర్వాత ఆయన ప్యానల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు రాజీనామాలను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. మా బైలాస్ ప్రకారం.. ఏదైనా పోస్ట్ కు ఖాళీ ఏర్పడితే ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేయాలి. మా అధ్యక్షుడైన విష్ణు ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఇక మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా వివాదాలు మాత్రం చల్లారడం లేదు. ఎన్నికలు జరిగాక.. బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తున్న కారణంగా.. మా ఎన్నికల అధికారి రాధాకృష్ణ మోహన్ స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవమని అన్నారు. బ్యాలెంట్ పేపర్ల బాక్సుల తాళాలు మాత్రమే తీసుకెళ్లాం.. బ్యాలెట్ పేపర్లు కాదని తెలిపారు. అనసూయ గెలిచిందన్న వార్తలు అవాస్తవమేనని చెప్పారు.

మా అసోషియేషన్ కు పోటీగా మరో అసోషియేషన్ ఏర్పాటు చేయనున్నట్టు జరుగుతున్న ప్రచారంపై ప్రకాశ్ రాజ్ స్పందించాడు. తాము కొత్త అసోషియేషన్ పెడతామంటూ ప్రచారం జరుగుతోందనీ.. అందులో వాస్తవం లేదన్నారు. ఆత్మ,పరమాత్మ, ప్రేతాత్మ అంటూ ఏవేవో ఊహించుకుంటున్నారనీ.. కానీ తమకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే వచ్చినట్టు చెప్పారు. బయటి నుంచే ప్రశ్నిస్తామంటున్నారు ప్రకాశ్ రాజ్.


మొత్తానికి మా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి.. ఆర్టిస్టులకు ఎలా దగ్గరవుతాడో చూడాలి.  

 









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: