ప్రకాష్ రాజ్ ద్వంద్వ వైఖరితో "మా" కు మకిలి పట్టనుందా?

VAMSI
ఈ సంవత్సరం మా అధ్యక్ష ఎన్నికలు గందరగోళంగా జరిగాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రేంజ్ లో వివాదాలు జరగడం చాలా చెత్తగా అనిపించింది. మొదటి నుండి అధ్యక్షుడిగా పోటీ చేసిన మంచి విష్ణు తన ప్యానెల్ విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అసలు మా లో పోటీ చేయడం ఇదే తొలిసారి అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న వాడిలా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.  ఇక మరోవైపు సినిమా జీవితంలో ఎంతో చరిత్ర కలిగిన ఉద్దండుడు ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు అని తెలియడంతో అందరూ అవాక్కయ్యారు. అసలు ఈ మెలిక ఎవ్వరూ ఊహించలేకపోయారు. అయితే ఇది తాను స్వతహాగా నిలబడినది కాదని ఎవరి ప్రోద్బలంతోనో మా ఎన్నికలో నిలబడ్డాడని పలు వార్తలు వచ్చాయి.
ప్రచారంలో భాగంగా ఇరు వర్గాల వారు దూషించుకున్నారు. అయితే ఇక్కడే వివాదాల స్థాయి మరింత పెరిగింది. అయితే పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో మా ఎన్నికలపై ఉత్కంఠ పెరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా హైప్ ఉంటుందో, అలా ఎలక్షన్ వరకు సాగింది. ఎట్టకేలకు ఆదివారం జరిగిన ఎన్నికలలో విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. అయితే ఈ గెలుపును తట్టుకోలేని కొన్ని వర్గాలు విష్ణును పలు రకాలుగా విమర్శించారు. అయితే ఈ ఎన్నికలో ఓడిపోయినా ప్రకాష్ రాజ్ మీడియా ముందు మా సభ్యత్వానికి రాజీనామా చేశానని, మా సభ్యులు అందరూ నన్ను కాదనుకున్నారు. కాబట్టే నేను "మా" కు రాజీనామా చేసానని తెలిపారు. అయితే నిన్నటి వరకు నేను మా లో లేనప్పటికీ ఎవ్వరూ ఎటువంటి సహాయం అడిగినా చేస్తాను అన్నారు.
మీడియా ఈ సందర్భంగా మీరు బయటికి వచ్చారు కాబట్టి ఏదైనా గ్రూప్ సెపరేట్ గా పెడతారా అన్న ప్రశ్నకు...ఛీ ఛీ నేనలా చేయను. మా ఎప్పుడూ ఒకటే ఉంటుంది అన్నాడు. కట్ చేస్తే ఇవాళ... ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచినా 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. విష్ణు తో కలిసి పనిచేయడం కుదరదని తేల్చేశారు. మరి నిన్న ఒకమాట, ఇవాళ ఒకమాట మాట్లాడిన ప్రకాష్ రాజ్ పై తెలుగు ప్రేక్షకులు విమర్శలు కురిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మూలంగా మా రెండుగా చీలిపోతుందని ఇప్పటికే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యవహరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి "మా"కు ఇంకెన్ని కష్టాలు తెస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: