సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. పలు రకాల నేపద్యాలలో చిత్రాలు తెరకెక్కుతుంటాయి. ప్రతి సినిమాలోనూ కొన్ని అంశాలు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్ని చిత్రాల్లో పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటే, కొన్ని సినిమాల్లో కొన్ని సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తాయి, మరికొన్ని చిత్రాల్లో మన సెలబ్రిటీలు చెప్పే డైలాగులు సూపర్ స్పెషల్ గా పాపులర్ అవుతాయి. ఇలా కొన్ని అంశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తుంటాయి. అయితే చాలా వరకు సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్స్ ఎక్కువగా జనాల్లోకి వెళుతుంటాయి. ఆ డైలాగ్స్ అనేవి సినిమాకే హైలెట్ గా మారుతుంటాయి. హీరో చెప్పే డైలాగ్స్ మాత్రమే కాదు కొన్ని సార్లు హీరోయిన్స్ చెప్పే క్యూట్ డైలాగ్స్ కూడా చాలా ఫేమస్ అవుతుంటాయి.
అలాంటి వాటిలో ప్రత్యేకమైన ఆదరణ పొందిన కొందరి హీరోయిన్స్ డైలాగ్స్ పై ఓ లుక్కేద్దాం పదండి. టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జెనీలియాకి బాగా గుర్తింపు తెచ్చిన చిత్రం బొమ్మరిల్లు. ఈ సినిమాలో ఈమె చెప్పే డైలాగ్స్ లో ఓ రెండు మూడు డైలాగులు ఎంత ఫేమస్ అయ్యాయి అంటే కాలర్ ట్యూన్ నుండి కాలింగ్ బెల్ వరకు కూడా ఆ డైలాగ్ మారుమ్రోగాయి. పెద్దవారే కాదు చిన్న పిల్లలు కూడా ఆ డైలాగ్స్ సరదాగా చెప్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ ఆ డైలాగ్స్ ఈపాటికే మీకు గుర్తు చేసే ఉంటాయి. అవేనండి
* హ హ హాసిని...అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ* ....
* జయం చిత్రంలో సదా చెప్పిన "వెళ్లవయ్యా వెళ్ళూ...."
* ఫిదా చిత్రంలో సాయి పల్లవి చెప్పిన "భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్లా"
* వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంలో "ప్రార్థన ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ" అని రకుల్ చెప్పే డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయింది.
* సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం లో హీరోయిన్ రెజీనా చెప్పే "సీత ఇక్కడ ... సీతతో అంత ఈజీ కాదు" వంటి హీరోయిన్స్ డైలాగ్స్ టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాయి.