అజయ్ భూపతి మాటలతో వేడెక్కిపోతున్న ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
ఈసారి దసరా రేస్ నాలుగు మీడియం రేంజ్ సినిమాల మధ్య తీవ్రమైన పోటీగా మారింది. ‘మహాసముద్రం’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ‘పెళ్ళిసందడి’ ‘వరుడు కావలెను’ సినిమాల మధ్య ఈసారి దసరా వార్ జరగబోతోంది. ఈ సినిమాల రిలీజ్ టైమ్ దగ్గర పడుతూ ఉండటంతో వరసపెట్టి ఈసినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ను భారీగా చేస్తున్నారు.


లేటెస్ట్ గా జరిగిన ‘మహాసముద్రం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు అజయ్ భూపతి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 'ఆర్ ఎక్స్ 100’ ఘనవిజయం తరువాత తాను '‘మహాసముద్రం'’ కథను నమ్ముకుని తాను ఎందరో హీరోల చుట్టూ తిరిగానని అయితే వారందరూ తన సినిమాలో నటిస్తానని చెప్పి చివరకు వేరే సినిమాల వైపు వెళ్ళిపోతే ఈ కథను నమ్మి తనకు డేట్స్ ఇచ్చిన సిద్ధార్థ్ శర్వానంద్ లకు ఈమూవీ కెరియర్ బ్రేక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా మారబోతోంది అంటూ సంకేతాలు ఇచ్చాడు.


వాస్తవానికి దర్శకుడు అజయ్ భూపతి ‘మహాసముద్రం’ కథను పట్టుకుని నాగచైతన్య రవితేజాల చుట్టూ తిరిగిన విషయానికి సంబంధించి వార్తలు వినిపించాయి. ఈమూవీ కథ నచ్చడంతో అప్పట్లో సమంత కూడ చైతూను ఈమూవీలో నటించమని చెప్పింది అంటూ వార్తలు కూడ వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.


చివరకు ఈమూవీ శర్వానంద్ సిద్ధార్థ లతో సిద్ధమైంది. ప్రస్తుతం చాలామంది సిద్ధార్థ్ పేరును మరిచిపోయారు. ‘బొమ్మరిల్లు’ మూవీ టైమ్ లో యూత్ కు క్రేజీ హీరోగా ఒక వెలుగు వెలిగిన సిద్ధార్థ్ ఈతరం ప్రేక్షకులకు గుర్తు ఉన్నాడా అన్న సందేహాలు కూడ కలుగుతున్నాయి. కొంతకాలం వరకు వరస హిట్లతో దూసుకు పోయిన శర్వానంద్ పరిస్థితి కూడ ఏమాత్రం బాగాలేదు. ఇలాంటి పరిస్థితులలో వీరిద్దరికీ ఒక సాలిడ్ హిట్ కావాలి దీనితో అజయ్ భూపతి అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి అన్నది దసరా రేస్ నిరూపిస్తుంది..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: