బ్రేకింగ్: మా కౌంటింగ్‌లో విష్ణు లీడ్... భారీగా క్రాస్ ఓటింగ్
ఇక మిగిలిన సభ్యులకు, అధ్యక్షడికి మధ్య భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. అంటే క్రాస్ ఓటింగ్ విష్ణుకు అనుకూలంగా జరిగిందా ? లేదా ? ప్రకాష్ రాజ్‌కు అనుకూలంగా జరిగిందా ? అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంటే క్రమ క్రమంగా విష్ణు వర్గంలో ధీమా మాత్రం పెరుగుతూ వస్తోంది. కొందరు విష్ణుకు ఇప్పటికే సన్మానాలు , సత్కారాలు చేసేస్తున్నారు.
విష్ణుకు బలంగా సపోర్ట్ చేస్తూ వస్తోన్న తాజా మా ప్రెసిడెంట్ నరేష్ విష్ణు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. విష్ణు 80 నుంచి 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని.. ఈ ఎన్నికల ఫలితాలే తమ రెండే ళ్ల పాలనకు రెఫరెండం అంటూ నరేష్ చెపుతున్నారు. ఇక కౌంటింగ్ హాలు లోనే ఎన్నికల అధికారితో ప్రకాష్ రాజ్ వాగ్వివాదా నికి దిగారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారితో గొడవకు దిగగా.. పక్కనే ఉన్న పెద్దలు సర్ది చెప్పడంతో ఆయన శాంతించారు. దీంతో తిరిగి కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక తుది ఫలితం వెల్లడి అయ్యే సరికి రాత్రి 9 గంటలు అవుతుందని అంచనా వేస్తున్నారు.