మంచు విష్ణు మెజార్టీపై లెక్కలు ఇవే...!
ఇ క మా పెద్దలు మోహన్ బాబు, జీవితా రాజశేఖర్ , శివకృష్ణ తదితరుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మరో వైపు నరేష్ కూడా అక్కడే ఉన్నారు. ఇక అటు ప్రకాష్ రాజ్, ఇటు విష్ణు ఇద్దరూ కూడా డయాస్ మీదే ఉండి ఓట్ల లెక్కింపు పరిశీ లిస్తున్నారు. ఇదిలా ఉంటే మా ఎన్నికల కౌంటింగ్ దగ్గర రసాభాస జరుగుతోంది. ఎన్నికల అధికారి కి ప్రకాష్ రాజ్ కు మధ్య గొడవ నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు లో తేడా ఉందని.. ఎన్నికల అధికారి తీరు సరిగా లేదని ప్రకాష్ రాజ్ ఫైర్ అవుతున్నారు.
ఇక మా పోలింగ్ ముగిశాక మీడియాతో మాట్లాడిన నరేష్ ఈ ఎన్నికలు తమ పాలనకు రిఫరెండెం అని చెప్పారు. విష్ణు 80 నుంచి 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. తాను పట్టుదల గలవాడిని అని.. మా పాలన లో మా ప్రతిష్ట మసక బారిందని ఎంతో మంది ఆరోపించారని.. వారికి ఈ ఎన్నికల ఫలితాలే గుణ పాఠం చెపుతాయని నరేష్ అన్నారు. ఇక మా ఎన్ని క లలో ఓటు వేసేందుకు బెంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి కూడా 40 మంది వరకు వచ్చారని. వీరంతా విష్ణు కే ఓటు వేశారని.. విష్ణు గెలుపులో వీరి ఓట్లు కీలకం కానున్నాయని నరేష్ చెప్పారు.