యాంకర్ సుమని అలా పిలిచి.. అందరి మనసు దోచేసిన తారకరత్న?

praveen
ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్గా కొనసాగుతుంది సుమా.  ఇక బుల్లితెరపై ఎంతో మంది కొత్త యాంకర్స్ వస్తున్నారు. కానీ అటు సుమా క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇక అంతకంతకు యాంకరింగ్ లో రాటుదేలి పోతున్న సుమ తనకు తిరుగు లేదు అని ప్రతి కార్యక్రమం ద్వారా నిరూపిస్తూనే ఉంది  ఇక ప్రస్తుతం బుల్లితెరపై ఏ యాంకర్ చేయలేనని షోలు సుమా చేస్తుంది అని చెప్పాలి.  అంతేకాదు ఇక సినిమా ఈవెంట్ లతో కూడా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది ఈ యాంకరమ్మ.

 అయితే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే మోస్ట్ సక్సెస్ఫుల్ కార్యక్రమాలలో ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమం కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి క్యాష్ సరికొత్తగా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి వారం కూడా వినూత్నమైన కామెడీ పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది క్యాష్ కార్యక్రమం.  ఇక ప్రతి వారం నలుగురు స్పెషల్ గెస్ట్ లు క్యాష్ లోకి ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో అలరిస్తూ ఉంటారు. ఇక ఇటీవల క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన విడుదలైన ప్రోమో సోషల్ మీడియా వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ వారం ఎపిసోడ్ లోడ్ నందమూరి తారక రత్న, రేఖ, వెంకట్, తను రాయ్ గెస్ట్ లుగా వచ్చారు.

 ఈ క్రమంలోనే ఇలా గెస్ట్ గా వచ్చిన వారిపై పంచులు వేస్తూ ఎప్పటిలాగానే సుమా ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించింది.  ప్రోమో చూస్తుంటే ఇక ఈ సారి కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంది అని అందరూ నమ్ముతున్నారు. అయితే సాధారణంగా క్యాష్ షో కి వచ్చిన వాళ్ళు సుమను అక్క అని పిలవడం గాని లేదా గారు అంటూ మర్యాద ఇవ్వడం గానీ చూశాము.  ఇటీవలే గెస్ట్ గా వచ్చిన తారకరత్న మాత్రం ఒక్క పిలుపుతో ప్రస్తుతం ఉన్న అభిమానుల మనసు గెలుచుకున్నాడు.  ఏకంగా వదిన అంటూ సుమా ని ప్రేమగా పిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మీ తాత గారి గురించి చెప్పు అంటూ సుమ తారకరత్నను అడిగిన  సమయంలో సమాధానం చెబుతూ వదిన అంటూ ప్రేమగా పిలుస్తాడు తారకరత్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: