గెలిచినా ఓడినా.. ఆ పని చేసి తీరుతా అంటున్న జీవిత..?
మంచు విష్ణు మేనిఫెస్టో బాగున్నప్పటికీ ఆ హామీలన్నీ ఎలా అమలు చేస్తారు అనే విషయంపై స్పష్టత లేదని.. ఒకవేళ మేనిఫెస్టో బాగున్నప్పటికీ వారు అవి అమలు చేయలేక పోతే ఏం చేయాలనే విషయంపై జీవిత ప్రశ్నిస్తోంది. ఒకవేళ గెలవక పోయినా కూడా మేము మా క్యాంటీన్ ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ప్రకటించింది. తన భర్త రాజశేఖర్ ట్రస్టు ద్వారా కొంత సహకారాన్ని తీసుకొని మా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నట్లుగా చెప్పుకొస్తోంది.
ఇక వివిధ ప్రాంతాలలో అన్న క్యాంటీన్, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ల ఇక్కడ కూడా మా క్యాంటీన్ అని పేరుతో ఒక క్యాంటీన్ పెట్టబోతున్న ఉన్నట్లుగా జీవిత రాజశేఖర్ తెలియజేశారు. ఇక రాజశేఖర్ మోహన్ బాబు ని కలవడానికి కూడా అందరూ ఏదో వింతగా చూస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇక హీరో నరేష్ అయితే ఈ విషయాన్ని ఎంతో పెద్దగా చేసి మాట్లాడారు అన్నట్లు ఆమె చెప్పుకొస్తోంది.
కేవలం మా ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే బాగుంటుందని ఉద్దేశంతోనే మోహన్ బాబు వద్దకు రాజశేఖర్ వెళ్ళినట్లు తెలిపారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే మోహన్ బాబు వెనకాలే ఉంటూ నరేష్ వారి గోతులు తవ్వుతూ ఉన్నారా అన్నట్లుగా తెలియజేసింది జీవితం. ఆయన వారి వెనక ఉండి మంచు ఫ్యామిలీకి నష్టమని తెలియజేస్తోంది ఆమె. గెలుపు ఎవరనే విషయంపై చెప్పలేను కానీ.. మా సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ గానే ఉంటుంది అని తెలియజేసింది జీవిత.