బాలీవుడ్ మీడియా మొత్తం ప్రస్తుతం ఒక విషయం పై చాలా ఫోకస్ పెట్టింది, అదే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేయడంతో ప్రస్తుతం బాలీవుడ్ మీడియా అంతా ఈ విషయంపై చాలా ఇంట్రెస్ట్ గా ఫోకస్ పెట్టారు. సాంఘిక మాధ్యమాలలో ఆర్యన్ ఖాన్ మీద విపరీతమైన నెగిటివిటీ చెలరేగుతోంది. అలా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మరియు అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ లు ఇప్పుడు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో ఫుల్ హాట్ టాపిక్ గా మారారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్న షారుక్ ఖాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆర్యన్ ఇంకా కస్టడీలోనే ఉండాలి అని రిమాండ్ ను పొడిగించాలి అని కోర్టును ఎన్సీబీ కోరింది.
దీనితో కోర్టు ఆర్యన్ తో సహా ఎనిమిది మంది నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక ఆర్యన్ ఖాన్ కోర్టు ముందు విన్నవించుకున్నాడు. తనకు ఆ క్రూయిజ్ పార్టీ నిర్వాహకులకు ఎలాంటి సంబంధం లేదని, తన ఫ్రెండ్ ఆహ్వానిస్తేనే వెళ్లాను అని ఆర్యన్ ఖాన్ తెలియజేశాడు. ఇక ఆర్యన్ ఖాన్, ఆర్భాజ్తో ఉన్న సంబంధాన్ని కూడా ఏమీ దాచిపెట్టడం లేదు, అతను నా ఫ్రెండ్ ఏ కానీ, అతను చేసే పనులకు నాకు ఏ విధమైన సంబంధం లేదు అని ఆర్యన్ తెలియజేశాడు. తనకు బెయిల్ ఇచ్చిన కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఆర్యన్ తెలియజేశాడు. కానీ కోర్టు మాత్రం ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయలేదు. ఆర్యాన్కు మద్దతుగా హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ ఎంతటి వివాదానికి దారి తీసిందో మన అందరికీ తెలిసిందే. హృతిక్ రోషన్ చేసిన ఆ పోస్ట్ మీద కంగనా తన స్టైల్ లో విమర్శల దాడి చేసింది. మరి షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు కోర్టులో తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.