బిగ్ బాస్ 5: ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచింది... వారిద్దరిలో ఒకరు అవుట్?
మొదటి నుండి చూస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో ఇతడి పర్ఫార్మెన్స్ ఎక్కడ పెద్దగా కనిపించలేదు. ఎపుడు షణ్ముఖ్ బంటులా అతడు చెప్పిందల్లా చేస్తూ కనిపించాడు. షణ్ముఖ ని సిరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే షణ్ముఖ్ ఏమో జస్వంత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్లు క్లియర్ గా కనిపించింది. ఈ మాట ఏకంగా హోస్ట్ నాగ్ కూడా అన్నారు. అయితే ఈ వారం మాత్రం జస్వంత్ కాస్త ఇంట్లో ఉన్నట్టు కనిపించాడు. టాస్క్ లో శ్రీ రామ్ చంద్రతో పోటీ పడి బాగానే తన పవర్ ను చూపించాడు. ఇది చూసిన వారంతా ఇన్నాళ్లు ఏమైపోయావు నాయన అనుకున్నారు. కానీ ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్ళే కంటిస్టెంట్ జస్వంతే నని సమాచారం. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక మరో హైలెట్ విషయం ఏమిటంటే... హమీద ..శ్రీ రామ్ ని హత్తుకొని ఫుల్ ఎమోషనల్ అయ్యి ఏడుస్తుండగా..తనని ఓదారుస్తున్న శ్రీ రామ్ హమీద బుగ్గ పై సడెన్ గా ముద్దు పెట్టడంతో అందరు షాక్ అయ్యారు. సమయం సందర్భం ఏదైనా కావచ్చు కానీ పదిమంది చూసే షోలో ఇదేం పని అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. మరి రేపు నాగ్ ఈ అంశంపై మాట్లాడుతారో లేదో...ఒకవేళ ప్రస్తావిస్తే ఏమంటారో చూడాలి.