అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి జాతిరత్నాలు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొదటి సినిమా జాతిరత్నాలు లో చిట్టి పాత్ర తో ఎంతగానో అలరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా జనాలను అదే రేంజ్ లో అలరిస్తూ ఉంటుంది. సినిమా ఆఫర్ల విషయం కాసేపు పక్కనబెడితే ఈ ముద్దు గుమ్మ ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ మరియు వీడియోస్ ను జనాలను పంచుకుంటూ జనాలను అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంబలో ఫరియా అబ్దుల్లా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియో ను పోస్ట్ చేసింది, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ ఫైనల్ గా మారుతుంది.
సాధారణం గానే డాన్స్ అంటే ఇష్టపడే ఫరియా అబ్దుల్లా నడి రోడ్డు పైనే తీన్మార్ స్టెప్పులు వేస్తూ జనాలను అట్రాక్ట్ చేసింది. పూర్తి సాంప్రదాయ వస్త్రాలంకరణ లో ఉన్న ఫరియా అబ్దుల్లా డ్రమ్ సౌండ్ కు తగినట్టుగా తీన్మార్ స్టెప్పులు వేసింది. ఆ వీడియోను స్వయంగా ఫరియా అబ్దుల్లా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం వల్ల ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ను జనాలతో పంచు కుంటూ ఫరియా అబ్దుల్లా తన మనసులోని మాట బయటకు చెప్పింది. డ్రమ్స్ శబ్దం వస్తుంటే నేను ఆపుకోలేక పోయాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయా. డ్రమ్ యొక్క పవర్ అదే అంటూ డాన్స్ మరియు మ్యూజిక్ పై తనకున్న ఇష్టాన్ని తెలియజేసింది. ఇలా ఫరియా అబ్దుల్లా ఏదో ఒక విధంగా జనాలను ఆలోచిస్తూనే ఉంది. ఇలా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఫరియా అబ్దుల్లా డీ సీక్వెల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.