కమెడియన్ తో నటించడానికి రెడీ అయిన స్నేహ ఉల్లాల్..!

Pulgam Srinivas
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో స్నేహ ఉల్లాల్ ని చాలా మంది జూనియర్ ఐశ్వరరాయ్ అని అనేవారు. ఎందు కంటే స్నేహ ఉల్లాల్ దాదాపుగా ఐశ్వర్యరాయ్ లాగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. దానికి తగ్గట్టుగానే ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. అలా స్నేహ ఉల్లాల్ నటించిన సినిమాలలో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో ఈ బ్యూటీ తెలుగు నాట మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.


 ఇలా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు ఏవి ఈ బ్యూటీ కి ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టే లేదు.
దానితో ఇతర భాషా సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న స్నేహ ఉల్లాల్ కు అక్కడ కూడా పెద్దగా విజయాలు దక్కలేదు. అలా హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో స్నేహ ఐటమ్ సాంగ్ లు చేయడానికి కూడా సిద్ధపడింది. ఆ తర్వాత సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటించడానికి కూడా సిద్ధం అయ్యింది. అలా మెల్లమెల్లగా ఆఫర్లు పట్టడంతో స్నేహా ఉల్లాల్ తిరిగి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించింది. ఇలా వెబ్ సిరీస్ లతో స్నేహ ఉల్లాల్ అనేక మంది ప్రేక్షకులను అలరించింది. ఎయిట్' అనే మూవీతో స్నేహ ఉల్లాల్ మళ్లీ రీ ఎంట్రీ కి రెడీ అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడు సప్తగిరి తో కలిసి ఓ మూవీలో నటించబోతుంది. నటుడిగా ఈ మద్య కాలంలో బిజీ అయిన సప్తగిరి హీరోగా చేయబోతున్న తదుపరి మూవీ ఎయిట్. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని.. ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీ ని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: