విడాకుల తర్వాత.. సమంతా షాకింగ్ పోస్ట్?
అయితే ఇటీవల అక్కినేని సమంత భరత నాగచైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఎన్నో రోజులనుంచి విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ అందరూ పుకార్లు మాత్రమే అనుకున్నారూ. కాని ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నట్లు సమంతా ప్రకటించి అందరికీ షాక్ కి గురిచేసింది. అయితే అంతకుముందు ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్న ఇక విడాకుల ప్రకటన తర్వాత మాత్రం సమంత పెట్టిన ప్రతి పోస్ట్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అందరిని ఆకర్షిస్తుంది.
ఈ క్రమంలోనే ఇటీవలే సమంత తన హ్యాండిల్స్ పేరును కూడా మార్చుకుంది. ఇక ఇటీవలే సమంత ఒక ఆశక్తికర పోస్టు పెట్టారు. అది కాస్తా సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఫ్లైట్ విండో నుంచి ఒక సిటీని వీడియో తీసిన సమంత దానిని ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసింది అంతేకాదు ఇక ఈ వీడియో కి ఒక ఆసక్తికర కామెంట్ కూడా జత చేసింది. నేను ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే ముందు నేను మారాలి.. అనే ఒక ఇంగ్లీష్ సాంగ్ ను ఈ పోస్ట్ కి జత చేసింది సమంత. దీన్ని బట్టి చూస్తే ఇండైరెక్ట్గా సమంత ఏదో మెసేజ్ ఇవ్వాలని భావిస్తోందని.. ఇక ఆమె వేరే నగరానికి వెళ్లి పోతుంది అని అర్థం ఉంది అంటూ పలువురు నెటిజన్లు దీనిపై కామెంట్ చేస్తున్నారు.