ఆఖరి నిముషంలో నాగార్జున దిద్దుబాట్లు !

Seetha Sailaja

నాగార్జున పైకి చెప్పలేనప్పటికీ లోలోపల తన పిల్లల విషయంలో జరుగుతున్న పరిణామాలతో తెగ టెన్షన్ పడుతున్నాడు. నాగచైతన్య సమంత ల విషయంలో వస్తున్న వార్తలను ఖండించకుండా మౌనంగా ఉంటున్నాడు. ఇప్పుడు అఖిల్ కెరియర్ కు పెద్ద పరీక్షగా మారిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ఫైనల్ ఎడిటింగ్ విషయంలో కూడ నాగ్ అనేక మార్పులు చేర్పులు సూచించినట్లు టాక్.


వాస్తవానికి ఈసినిమా కోవిడ్ పరిస్థితులు ప్రారంభం అవ్వకముందు విడుదల కావలసిన మూవీ ఆతరువాత ఈ సినిమాకు అనేక ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ ఈసినిమాను ధియేటర్లలోనే విడుదల చేయాలి అన్న పట్టుదలతో అఖిల్ కోరికమేరకు నాగార్జున ఈసినిమాకు సంబంధించి ధియేటర్ల రిలీజ్ వైపు అడుగులు వేసాడు. ఈమూవీని ఓటీటీ లో విడుదల చేస్తే బాగుంటుంది అన్న అల్లు అరవింద్ అభిప్రాయాన్ని కూడ లెక్క చేయకుండా నాగ్ పట్టుబట్టి ఈమూవీని ధియేటర్లలో విడుదల చేయిస్తున్నాడు.


ఈసినిమాలో పూజ హెగ్డే గ్లామర్ సరిపోదని నాగార్జున సలహాతో ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ఫరియ అబ్దుల్లా ఇషా రెబ్బా లను కూడ యాడ్ చేసారు. అనేక ఆలోచనలు చేసి ఈసినిమాను దసరా రేస్ లో శర్వానంద్ ‘మహాసముద్రం’ రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ మూవీల పోటీ మధ్య విడుదల చేస్తున్నారు. అఖిల్ కు ఈసినిమా కూడ నిరాశను మిగిలిస్తే అతడి కెరియర్ మరింత సమస్యలలో కూరుకుపోతుంది.


ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని నాగార్జున ఒకటికి 10 సార్లు తన ‘బిగ్ బాస్’ హదావిదిని కూడ లెక్క చేయకుండా ఈమూవీ ఎడిటింగ్ గురించి అదేవిధంగా ఈ మూవీ ప్రమోషన్ గురించి చాల ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో నాగ్ తన కొడుకు పై ఉన్న ప్రేమతో ఒకటికి 10 సార్లు కేలుకుతున్న ఈమూవీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా ఉంది. దసరా రేసు విజేత ఎవరు అన్న ఆశక్తి అందరిలోను కొనసాగుతూ అఖిల్ కెరియర్ గురించి చర్చలు జరుగుతున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: