పవన్ కళ్యాణ్ పై జీవిత రాజశేఖర్ సంచలన కామెంట్స్..!

Pulgam Srinivas
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం చాలా రసవత్తరంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జగన్ సర్కార్ కు మధ్య  మాటల యుద్ధ మే నడుస్తోంది అని చెప్పవచ్చు. ఇలా ఈ సమస్యలో కి తాజాగా జీవిత రాజశేఖర్ ఎంటర్ అయ్యింది. జీవితా రాజశేఖర్ తన అభిప్రాయాన్ని చాలా స్పష్టం గా వ్యక్త పరిచింది. రాజకీయాలు వేరు సినిమాలు వేరు, ఈ రెండిటిని ముడి పెట్టి మాట్లాడను. పవన్ కళ్యాణ్ ను సినిమా హీరోగా గౌరవిస్తాను. మంచి వ్యక్తిత్వం గల మనిషి అని జీవిత రాజశేఖర్ తెలియ జేసింది. నిర్మాతలకు, సినిమా పరిశ్రమకు చాలా సహాయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమాల పరంగా నాకు పవన్ కళ్యాణ్ తో ఎలాంటి విభేదాలు లేవు. అయితే రాజకీయ నాయకుడి గా ఆయన చేసిన కామెంట్లకు సినిమా పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రెండు విషయాలను పోల్చి చూడకూడదు.


ఒక వ్యక్తి సినిమా ల్లోనూ, రాజకీయాల్లోనూ రెండింటి లోనూ ఉండవచ్చు. కానీ రాజకీయ విషయాలను పరిశ్రమకు ఆపాదించడం సరి కాదు. పవన్ కళ్యాణ్ అలా అన్వయించడనే మేము భావిస్తున్నానని జీవిత రాజశేఖర్ తెలియజేసింది. అలాగే కమెడియన్ పృథ్వి , బండ్లగణేష్ నేనంటే భయపడుతున్నారు అని జీవిత రాజశేఖర్ తెలియజేసింది. అందుకే నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని, అలా కాకపోతే మాలో చాలా మంది పోటీదారులు ఉన్నప్పటికీ తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసినట్లు అని జీవిత రాజశేఖర్ ప్రశ్నించారు. తనంటే వారికి భయం కాబట్టే నన్ను టార్గెట్ చేశారు అంటూ జీవిత రాజశేఖర్ తెలియజేసింది. ఇలా జీవిత రాజశేఖర్ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి తాజాగా స్పందించింది. ప్రస్తుతం మా ఎలక్షన్లు కూడా దగ్గర పడటంతో ఈ విషయం మరింత ముదిరే అవకాశం ఉందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: