కాజల్ సినిమాల విషయంలో భర్త పాత్ర... ?

VAMSI
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం దాటినా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతూ సత్తా చాటుతోంది. పెళ్లయ్యాక లేదా కాస్త వయసు మీద పడ్డాక చాలా మంది స్టార్ హీరోయిన్ లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంటే, కాజల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఎప్పటి లాగే గ్లామర్ షో ఉండే పాత్రల్లోనే కనిపిస్తూ ఎవర్ గ్రీన్ లా వెలిగిపోతోంది. ఓ వైపు సినిమాలతో బిజీగా మరో వైపు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. సినిమాల వేగం తగ్గించింది కానీ హీరోయిన్ గా ఎప్పటిలాగే గ్లామర్ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన "ఆచార్య" మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కాకుండా ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్న నాగార్జున చిత్రంలోనూ హీరోయిన్ గా చేయబోతున్నట్లు అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల నుండి నాగ్ సినిమా నుండి కాజల్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇపుడు మరో సారి ఇదే వార్తపై మరో కథనం వినిపిస్తోంది. కాజల్ నాగ్ మూవీ కన్నా ముందు తమిళ్ లో ఓ స్టార్ హీరో కి ఒప్పుకుందని అయితే ఇపుడు ఆ సినిమాకి నాగ్ సినిమాకి షెడ్యుల్ ప్రకారం డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టమవడంతో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్ధంకాక ఈ విషయం సలహా ఇవ్వమని భర్త కిచ్లు ని అడిగారట కాజల్.

అయితే అందుకు ఆయన నువ్వు దేనికైతే నువ్వు ముందు కమిట్మెంట్ ఇచ్చావో దానికి డేట్స్ కన్ఫర్మ్ చేస్తేనే కరెక్టేమో అని నా ఉద్దేశం అని అనడంతో కాస్త కష్టంగానే ఉన్న తప్పక నాగ్ మూవీ నుండి తప్పుకున్నారట కాజల్. ఈ విషయాన్ని డైరెక్టర్ కి మరియు నాగ్ కి పర్సనల్ గా కూడా చెప్పినట్లు చెబుతున్నారు. అలా గౌతం కిచ్లు పరోక్షంగా ఈ మూవీ నుండి కాజల్ లెఫ్ట్ అవ్వడానికి కారణమయ్యారు అని అంటున్నారు. మరి నిజంగానే కాజల్ నాగ్ మూవీ నుండి తప్పుకున్నారా లేదా అన్నది అధికార ప్రకటన వస్తే కానీ పూర్తిగా కరెక్ట్ అని చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: