భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ తో వచ్చిన రానా..!

Divya
మలయాళంలో బంపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే సినిమా నుంచి తెలుగులో భీమ్లా నాయక్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాత్ర గురించి చిత్ర బృందం యూనిట్ కొన్ని వీడియోలను ఫోటోలను విడుదల చేసిన విషయం తెలిసిందే కానీ రానా అభిమానులు అప్పుడు తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు..

ఇప్పుడు రానా కు సంబంధించిన ఒక అఫీషియల్ టీజర్ ను  విడుదల చేయడం తో  అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు రానా అభిమానులను ఫుల్ ఖుషి లో ఉన్నారు.రానా దగ్గుబాటి సైతం కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాసేపటి క్రితం రానా పాత్రకు సంబంధించిన టీజర్‏ను  విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో రానా.. డేనియల్ శేఖర్ అనే పాత్రలో చాలా బాగా అదరగొట్టాడు. పంచెకట్టులో వున్న రానా లుక్‏కు మాస్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

 

ఇక ఈ టీజర్ లో నిత్యామీనన్‏కు రానా వార్నింగ్ ఇస్తూ కనిపిస్తాడు.. అంతేకాదు నిత్యా మీనన్ తో రానా..నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.. స్టేషన్‏లో టాక్  నడుస్తోంది.. నేనేవరో తెలుసా..?  ధర్మేంద్ర.. హీరో..!  అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు .. డాని ఎంటర్‏టైన్మెంట్ ప్రోడక్షన్ నంబర్ 1 అంటూ రానా చెప్పే డైలాగ్స్ బాగా  ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను  సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‏టైన్‏మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక  త్రివిక్రమ్ మాటలు రచిస్తున్నాడు. గత కొన్ని రోజుల కింద భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదలై యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టించింది. ఇందులో పవన్ కళ్యాణ్ ‏కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా కు జోడీగా  ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం 2022 జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయబోతున్నారనే వార్త వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: