బుల్లితెరపై మెరుపులు... వెండితెరపై వెలుగులు..!
బుల్లితెరను తక్కువగా అంచనా వేయకూడదు. అదే ఇపుడు సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటి వరకు చాలామంది నటులు బుల్లి తెరపై కనిపించి... మంచి మంచి ఛాన్స్ లే కొట్టేశారు. తమ సినీరంగ ప్రయాణంలో ఎన్నో మైళ్లను అధిగమిస్తున్నారు.
ఒకప్పుడు టీవీల్లోకి వెళ్తే బిగ్‌స్క్రీన్‌లో అవకాశాలు అంతగా రావని ఒక ఒపీనియన్ ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోతున్నాయి. టీవీ సెలబ్రిటీస్‌కి సినిమాల్లో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. భారీ సినిమాల నుంచి పిలుపు వస్తోంది. ముఖ్యంగా హాట్ యాంకర్స్‌కి డిమాండ్ పెరుగుతోంది.
అనసూయ కాస్ట్యూమ్స్ గురించి సోషల్ మీడియాలో ఎంత డిస్కషన్ జరుగుతుందో, సినిమాల్లో కూడా అదే రేంజ్లో అవకాశాలు అందుకుంటోంది. సినీజనాలు కూడా ఆశ్చర్యపోయేలా యూనిక్ క్యారెక్టర్స్ ప్లే చేస్తోంది. రీసెంట్‌గానే 'థ్యాంక్యూ బ్రదర్'లో లీడ్ రోల్ ప్లే చేసిన అనసూయ, నెక్ట్స్ సంపత్ నంది నిర్మాణంలో ఒక సినిమా చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో అనసూయ లీడ్ రోల్ ప్లే చేస్తుందని సమాచారం.
అనసూయకి బిగినింగ్‌లో హాట్ యాంకర్ అనే ఇమేజ్ ఉండేది. అయితే 'క్షణం, రంగస్థలం' సినిమాలతో ఈ ఇమేజ్ నుంచి బయటపడింది. రంగమ్మత్త క్యారెక్టర్‌తో సర్ప్రైజ్ చేసింది. భారీ సినిమాల్లో కూడా నటిస్తోంది. అల్లు అర్జున్ 'పుష్ప', రవితేజ 'ఖిలాడి'తో పాటు చిరంజీవి 'ఆచార్య'లో కూడా నటిస్తోంది అనసూయ. శ్రీముఖి కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. టీవీ షోస్‌తో పాపులర్ అయ్యాక సినిమాల్లోనూ లీడ్ రోల్స్ వస్తున్నాయి. 'క్రేజీ అంకుల్స్'లో కీ రోల్ ప్లే చేసింది. అలాగే 'మాస్ట్రో' సినిమాలోనూ నటించింది.