కొత్త లుక్ లో చ‌ర‌ణ్.. స‌మ్ థింగ్ బిగ్ అంటూ..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న ఇన్స్టా గ్రామ్ లో ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. ద‌ట్ట‌మైన పొగ‌లో క్యాప్ పెట్టుకున్న‌ట్టు చ‌ర‌ణ్ క‌నిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోకు చ‌ర‌ణ్ త్వ‌ర‌లో ఓ అదిరిపోయే వార్త రాబోతుందంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ప్ర‌పంచంలోని వినోదాన్ని మీవ‌ద్ద‌కు తీసుకురావ‌డానికి సిద్ద‌మ‌య్యా అని చ‌ర‌ణ్ పేర్కొన్నారు. ఇక చ‌ర‌ణ్ ఈ ఫోటో ఎందుకు పోస్ట్ చేశారు..ఏ సినిమా కోసం అని అంతా షాక్ అవుతున్నారు. అయితే టాలీవుడ్ టాక్ ప్ర‌కారం రాంచ‌ర‌ణ్ ప్ర‌ముఖ ఓటీటీ హాట్ స్టార్ తో ఒప్పందం చేసుకున్నార‌ట‌. చ‌ర‌ణ్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నార‌ట‌. 

అంతే కాకుండా అందుకోసం చ‌ర‌ణ్ హాట్ స్టార్ నుండి భారీగా పుచ్చుకుంటున్నార‌ట‌. చ‌ర‌ణ్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఏడాది కాలం పాటు ఉండేందుకు డీల్ కుదుర్చుకున్నార‌ట‌. అయితే ఇప్పుడు దానికి సంబంధిచిన యాడ్ షూట్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. దానికి సంబంధిచిన ఫోటోనే రాంచ‌ర‌ణ్ పోస్ట్ చేసి ఉండొచ్చ‌ని అంతా బావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా చెర్రి సినిమాల‌తో పాటు ప‌లు బిజినెస్ ల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక  ఇప్పుడు హాట్ స్టార్ తో కూడా ఒప్పందం చేసుకుని భారీ డీల్ కుదుర్చుకున్నారు.

ఇక ప్ర‌స్తుతం రామ్ చ‌రణ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తికాగా చ‌ర‌ణ్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్క‌నున్న సినిమాకు కూడా ఇటీవ‌లే క్లాప్ కొట్టారు. ఆర్ఆర్ఆర్ లో చెర్రీ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుద‌లైన చ‌ర‌ణ్ లుక్ అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. మ‌రో వైపు ఆర్ఆర్ఆర్ నుండి చెర్రీకి సంబంధిచిన టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌గా టీజ‌ర్ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు చెర్రీ కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమాలో కూడా న‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: