డేంజర్ జోన్ లో రకుల్..!

NAGARJUNA NAKKA
రకుల్‌ ప్రీత్‌ సింగ్ కెరియర్ డేంజర్ జోన్ లో పడింది. తెలుగులో ఇప్పటికే ఆమె గ్రాఫ్ చాలా పడిపోయింది. బాలీవుడ్ లో అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆలోచించినా.. అది ముందుకు సాగలేదు. హిందీ సినిమాలతో బిజీగా గడపొచ్చని అనుకున్నా.. ఈ అమ్మడికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఒక వైపు ఫ్లాపులు, మరోవైపు ఆగిపోతోన్న సినిమాలతో రకుల్‌ డేంజర్‌ జోన్‌లో పడిపోయింది.  
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి 'మన్మథుడు2' ఎప్పుడైతే చేసిందో.. ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. సీనియర్ హీరోయిన్ అని యంగ్‌స్టర్స్, యూత్‌లో క్రేజ్‌ తగ్గిపోయిందని స్టార్ హీరోలు వివిధ కారణాలతో రకుల్‌ని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో బాలీవుడ్‌ పైనే ఏకాగ్రత పెట్టుకుంది. వరుస సినిమాలతో అక్కడ బిజీ కావాలని ఆరాపడుతోంది. ఈ ఆలోచనలకు తగ్గట్టుగానే 'దేదే ప్యార్‌ దే' తర్వాత రకుల్‌కి అరడజనుకుపైగా హిందీ సినిమాలు వచ్చాయి.
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పటివరకు హిందీలో ఆరు సినిమాలు విడుదల చేసింది. అయితే వీటిల్లో 'దేదే ప్యార్ దే' మాత్రమే ఆడియన్స్‌ని మెప్పించింది. 'షిమ్లా మిర్చి, సర్దార్‌ కా గ్రాండ్‌సన్' సినిమాలు అయితే డిజాస్టర్‌ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో రకుల్‌కి రావాల్సిన మైలేజ్ ఇంకా రాలేదు. ఈ లోపు రకుల్‌ లీడ్‌రోల్‌లో అనౌన్స్‌ అయిన 'ఛత్రివాలీ' సినిమాని ఆపేస్తున్నామని ప్రకటించాడు నిర్మాత రోనీ స్క్రూవాలా. ఇదే రకుల్ నుకుంగదీసింది.
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో 'కొండపొలం' సినిమాతో అదృష్టం పరీక్షించుకుంటోంది. అక్టోబర్‌ 8న విడుదలవుతోన్న ఈ సినిమాతో ఆడియన్స్‌ని మెప్పించాలని ఆరాటపడుతోంది. అలాగే హిందీలో చేస్తోన్న 'ఎటాక్, మేడే, థాంక్‌ గాడ్, డాక్టర్ జి' సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతోంది. మరి ఈ మూవీస్‌తో రకుల్ గ్రాఫ్ పెరుగుతుందో లేదో మరి. చూద్దాం.. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ ఇస్తాయో. అలాగే తెలుగులో వస్తున్న కొండపొలం ఆమెను కొండెక్కిందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: