భీమ్లా నాయక్ కు గుడ్ బై చెప్పిన టాలెంటెడ్ హీరోయిన్..?

MADDIBOINA AJAY KUMAR
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో మ‌లయాల సూప‌ర్ హ‌ట్ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ భీమ్లా నాయ‌క్ కూడా ఒక‌టి. ఇక ఇప్ప‌టికే షూటింగ్ జ‌రుగుతున్న ఈ సినిమాలో రానా కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రానాకు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తోందంటూ గ‌త కొద్ది రోజులుగా ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్తలు వ‌స్తున్నాయి. ఈ హీరోయిన్ దాదాపుగా రానా పక్క‌న న‌టించేందుకు ఖారాయ్యింద‌ని అంతా అనుకున్న స‌మ‌యంలో మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. భీమ్లా నాయక్ సినిమా నుండి ఐశ్వ‌ర్య రాజేష్ తప్పుకున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 

ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ ప్రకారం..ఐశ్వ‌ర్య రాజేష్ ఇప్ప‌టికే ప‌లు త‌మిళ చిత్రాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌...ఈ నేప‌థ్యంలోనే డేట్స్ స‌మ‌స్య రావ‌డంతో భీమ్లా నాయ‌క్ సినిమాకు గుడ్ చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. దాంతో భీమ్లా నాయ‌క్ చిత్ర బృందం రానా హీరోయిన్ కోసం మ‌ళ్లీ వేట మొద‌లు పెట్ట‌బోతుంది. ఇప్ప‌టికే  ఈ పాత్ర కోసం మ‌ల‌యాళ న‌టి సంయుక్త మీన‌న్ ను కూడా సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ దీనిపై చిత్ర యూటిన్ అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇదిలా ఉండ‌గా భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

మ‌రోవైపు ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్న‌ట్టు స‌మాచారం..అయితే ఇప్పుడు రానా స‌ర‌స‌న న‌టించే రోల్ కోసం హీరోయిన్ ను త్వ‌ర‌గా సెట్ చేసి షూటింగ్ త్వ‌ర‌గా పూర్తిచేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గా ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగులో ప‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ అమ్మ‌డి న‌ట‌న‌కు ఫిదా అయిన టాలీవుడ్ ప్రేక్ష‌కులు కూడా అచ్చం తెలుగ‌మ్మాయిలాగే ఉంద‌ని అనుకుంటున్నారు. వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలో ఐశ్వ‌ర్య రాజేష్ విజయ్ దేవ‌ర కొండ‌కు మిడిల్ క్లాస్ భార్య పాత్ర‌లో న‌టించి తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టింది. అయితే ఇప్పుడు రానా ప‌క్క‌న ప‌వ‌న్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకోవ‌డం మాత్రం పెద్ద త‌ప్పిద‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: