నాగార్జున ఆస్తుల విలువ అన్ని కోట్లా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీకి రెండు కుటుంబాలు రెండు కళ్ల లాంటివి అని చెబుతారు.. ఒకటి అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ అయితే , మరొకటి నందమూరి ఫ్యామిలీ అని చెప్పవచ్చు.. ఈ రెండు ఫ్యామిలీల నుంచి తరతరాలుగా వారసులు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతూనే ,తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, అయితే ఆ రెండు ఫ్యామిలీలలో ఒకటైన దివంగత గ్రేట్ లెజెండ్రీ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగేశ్వరరావు కొడుకు అక్కినేని నాగార్జున కూడా నవ మన్మధుడు గా, కింగ్ నాగార్జున గా గుర్తింపు పొందాడు.
ఇక నాగార్జున 1959 ఆగస్టు 29వ తేదీన చెన్నైలో జన్మించాడు. ఎమ్మెస్ పట్టా అందుకున్న నాగార్జున సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని మొదట వివాహం చేసుకున్నారు. వీరికి అక్కినేని నాగచైతన్య జన్మించిన తర్వాత, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరూ ఒకరికొకరు విడిపోవడం జరిగింది. ఇక తర్వాత తనతో సహా నటి గా నటించిన అమల ను వివాహం చేసుకున్నారు . వీరికి అక్కినేని అఖిల్ జన్మించాడు. 1986లో విక్రమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా పరిచయమయ్యాడు అక్కినేని నాగార్జున.

కేవలం హీరోగానే కాకుండా మా టీవీ కి కో-ప్రొడ్యూసర్ గా కూడా పని చేస్తున్నాడు. అన్నపూర్ణ నిర్మాణ సంస్థ ద్వారా కూడా నాగార్జునకు మంచి లాభాలు వస్తున్నాయి అని చెప్పవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అంతే కాదు పలు సీరియల్స్ కి కూడా నాగార్జున పెట్టుబడి పెట్టాడు. ఇక రియల్ ఎస్టేట్ తో పాటు చాలా నగరాలలో కమర్షియల్  కాంప్లెక్స్ కు కూడా నాగార్జున కు ఉన్నాయి. ఇండియన్ ఫుట్ బాల్ లీగ్ లో సైతం కేరళ బ్లాస్టర్స్ టీం కొనుగోలు చేశాడు.
కళ్యాణ్ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్న నాగార్జున, ఆస్తి విలువ తెలిస్తే ఎంత లేదన్నా 20 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని అంచనా.. ఇక తండ్రి వారసత్వంగా ఐదువేల కోట్లను తీసుకున్నాడు నాగార్జున. 5 వేల కోట్లతో మొదలుపెట్టి రూ.20 వేల కోట్లకు తన ఆస్తిని పెంపొందించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: