'సీటీమార్' హీరోయిన్ కి అంత పెద్ద అన్యాయం జరిగిందా..?

Anilkumar
యాక్షన్ హీరో గోపిచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సీటీమార్'.వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10 న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.విడుదలైన మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది.ఈ సినిమా దర్శకుడు సంపత్ నంది తీసుకుంది పాత పాయింటే అయినప్పటికీ..ఎంగేజింగ్ టేకింగ్ తో మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో  గోపిచంద్ సరసన తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటించింది.అయితే సినిమాలో తమన్నా తో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది.


ఆమె పేరు దివంగన సూర్యవంశీ.అయితే 'సీటీమార్' సినిమా విడుదల సమయంలో ఈ హీరోయిన్ ను అంతగా ప్రమోట్ చేయలేదు చిత్ర యూనిట్.అటు మీడియాలో కూడా ఈ హీరోయిన్ గురించి పెద్దగా చర్చ జరిగింది లేదు.ఇక గతంలో ఈ భామ 'హిప్పీ', 'వలయం' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఇక ఇదిలా ఉంటె..సీటిమార్ సినిమాలో తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది ఈ హీరోయిన్.సినిమాలో ఈమె లుక్స్ కూడా బాగున్నాయి.ఇక సినిమాలో సీటీ ఛానెల్ లో న్యూస్ రీడర్ ఆకృతి అనే పాత్రలో నటించింది దివంగన.సినిమాలో రావు రమేష్ తో కలసి ఈ హీరోయిన్ చేసిన కామెడీ కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.


ఇక చూడటానికి ఈమె పొడుగ్గా ఉంటుంది కాబట్టి గోపిచంద్ పక్కన కరెక్ట్ గా సరిపోతుంది.కానీ సినిమాలో గోపిచంద్ తో ఈ హీరోయిన్ కి కాంబినేషన్ సీన్స్ లేవు.అయితే తాజా సమాచారం ప్రకారం ఈమెకు సంబంధించి సినిమాలో చాలా సీన్లు చిత్రీకరించారట.కానీ సినిమా నిడివి ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో ఎడిటింగ్ లో ఆ సీన్లను లేపేసారట.అంతేకాదు ఆ లేపేసిన భాగంలో గోపిచంద్ కి ఈ హీరోయిన్ కి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది.దీంతో సినిమాలో ఈ హీరోయిన్ కి ఒక విధంగా పెద్ద అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే దివంగన మెయిన్ లీడ్ పోషించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి.అలాంటిది సినిమాలో ఈమెకు సంబంధించి ఓ పాటనే లేపేసారంటే అది అన్యాయమే కదా మరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: