బొబ్బిలి రాజా@ 31యేళ్లు.. ఈ సినిమా విశేషాలు ఇవే..?

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ ఎంత గొప్ప నటుడు మనకు తెలిసిన విషయమే. ఇక ఈయన అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని, ఇటు హీరోగా తన అభిమానులను బాగా అలరిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా చిత్రంకు 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అయితే ఈ మూవీకు సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఈ సినిమాని తన తండ్రి డీ. రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రాని గోపాల్ డైరెక్టర్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 14 న 1990వ సంవత్సరంలో విడుదలై వెంకటేష్ కెరీర్ నే మార్చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో హీరో వెంకటేష్ స్టార్ హీరోగా మారిపోయాడు.  ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం బాగా ఉపయోగపడింది. ఈ సినిమాలోని హీరోయిన్ గా దివ్యభారతి అదరకొట్టింది అని చెప్పవచ్చు.

ఈ సినిమా మొత్తం పూర్తి ఫారెస్ట్ లోనే తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి స్టార్ హీరో కమల్ హాసన్ క్లాప్స్ కొట్టారు. ఇక ఈ సినిమా 200 రోజులు వేడుకలలో ముఖ్య అతిథులుగా హీరో శోభన్ బాబు హాజరయ్యారు.. ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటించిన కోట శ్రీనివాసరావు, వాణిశ్రీ, బాబు మోహన్ ఇతర నటుల కూడా తమ నటనతో బాగా నటించారని చెప్పవచ్చు. ఈ సినిమాని హిందీలో కూడా రీమిక్స్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఆ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా బొబ్బిలి రాజా నిలిచింది. ఇక ఈ సినిమాతో నిర్మాతగా సురేష్ గారు మొదలుపెట్టాడు. ఈ సినిమాకి మాటలు అందించింది పరుచూరి గోపాలకృష్ణ. ఏదిఏమైనా విభిన్న పాత్రలు వేయడం కేవలం హీరో వెంకటేష్ గారికి సాధ్యమైనంతగా ఏ హీరో చేయలేరని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: