జబర్దస్త్ లో లేడీ గెటప్ లకు వేసే.. చీరలను తర్వాత ఏం చేస్తారో తెలుసా?
ఈ షోతో వచ్చిన పాపులారిటీ కారణంగా ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. అక్కడ కూడా ఆమె బాగానే డబ్బులు సంపాదించింది. ఇక లేడీ కంటెస్టెంట్స్ లో సత్య శ్రీ సైతం బాగా క్లిక్ అయింది. సత్య శ్రీ అమ్మాయే. అయినా సరే ఈ జబర్దస్త్ షోలో బాగా ఇమిడిపోయింది. ఈ అందాల తార ఎక్కువగా చమ్మక్ చంద్ర స్కిట్లలో కామెడీ చేస్తూ అలరించేది. జబర్దస్త్ షో తర్వాత పలు షోస్ కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
ఇకపోతే జబర్దస్త్ షోలో సత్య శ్రీ కట్టిన ప్రతి ఒక్క చీర కూడా సూపర్ హిట్ అయింది. తన చీరకట్టుకు ఫ్యాన్స్ ఉన్నారని ఒకానొక సమయంలో ఆమె చెప్పింది. తాను కట్టుకున్న చీరలు అన్నీ తన తల్లి కట్టుకున్నవే అని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు, దాదాపు 500 ఎపిసోడ్ లలో తాను కట్టిన చీరను మరోసారి ధరించలేదని ఆమె చెప్పింది. అంటే ఏకంగా 500 సారీలు ఆమె కట్టుకుంది. అయితే మిగతా వారు మాత్రం షో నిర్వాహకులు ఇచ్చిన చీరలనే ఎక్కువ స్కిట్లలో మార్చి మార్చి ధరిస్తారని చెప్పింది. కానీ సత్య శ్రీ మాత్రం అన్నీ కొత్త శారీ లే కట్టుకుంది వాటిని మిగతా లేడీ గెటప్‌లు కట్టుకున్నారు అలా వృధా చేయకుండా వాటిని వాడేసారు. చమ్మక్ చంద్ర వెళ్ళిపోయిన తర్వాత సత్య శ్రీ ఇప్పుడు జబర్దస్త్ షోలో కనిపిస్తుందో లేదో కానీ శాంతి స్వరూప్ మాత్రం లేడీ గెటప్‌లో ఈ షోలో నాటుకు పోయాడు.