అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకోసం దాదాపు రెండు నెలల టైం మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో అలా అమెరికా పీఠంపై కాలుపెట్టబోతున్నాడో లేదో అంతకంటే ముందుగానే అమెరికన్ భారతీయుల పిల్లల పౌరసత్వంపై డొనాల్డ్ ట్రంప్ భారీ నిర్ణయం తీసుకుంటున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిరాగానే భారతీయుకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.అది కనుక చట్టం రూపం దాలిస్తే అమెరికాలో పుట్టిన లక్షల మంది పిల్లలు అమెరికన్ పౌరులు కాకుండా పోతారనే ఆందోళన మొదలైంది. కొత్తగా తీసుకువస్తున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం, అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు ఆటోమెటిక్ అమెరికా పౌరులుగా మారాలంటే తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయి వుండాలి. అలా కాని పక్షంలో ఆ బిడ్డ అమెరికా పౌరుడు అయ్యే అర్హత వుండదు. ఇప్పుడిదే అమెరికాలో వుంటున్న భారతీయులకు ఉలికిపాటుకి గురిచేస్తోంది.
తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపుగా 48 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు వున్నారు.వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే జన్మించారు. అందువల్ల వారికి జన్మతహా అమెరికా పౌరసత్వం లభించింది. కానీ కొత్త చట్టం రూపుదాలిస్తే... నిబంధనల ప్రకారం అక్కడ పుట్టిన పిల్లలు అనర్హులయ్యే అవకాశం వుంది. ఐతే కోర్టులో ట్రంప్ చట్టం నిలబడదని మరికొందరు వాదిస్తున్నారు.ఈ క్రమంలో H1B, F1వీసాలపై అక్కడకు వెళ్లి ఉద్యోగం చేస్తున్నవారు, వారి కుటుంబాలకు ఇది దెబ్బే.ఎందుకంటే గ్రీన్‌కార్డు కోసం ఇప్పటికే 12లక్షల మంది క్యూలో ఉన్నారు. EB1 కేటగిరీలో లక్షన్నర మంది.. EB2 కేటగిరీలో ఎనిమిదిన్నర లక్షల మంది.. EB3 కేటగిరీలో రెండున్నర లక్షల మంది ఉన్నారు.గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఆరులక్షల మంది ఉంటే.. వారిపై ఆధారపడ్డ వారు ఆరున్నల లక్షలమంది ఉన్నారు. ఇప్పుడు గ్రీన్‌కార్డుల జారీనే కష్టతరంగా ఉందంటే.. ట్రంప్ తీసుకొస్తున్న కొత్త చట్టంతో మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే H1B వీసా స్కాంపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు ఈ చట్టంతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయుల కలలు ఇంకాస్త కష్టంగా మారబోతున్నాయి.