బిగ్‌బాస్‌లో ఊహించని ఎలిమినేషన్.. కన్నడ కంచుకోట బద్దలైనట్టేనా?
ఈ వారం ప్రేరణ మెగా చీఫ్‌గా ఎంపికయ్యారు. బిగ్‌బాస్ ఒక ఆసక్తికరమైన టాస్క్‌ను ఇచ్చారు. ఈ టాస్క్‌లో ప్రతి కంటెస్టెంట్స్ ఫోటో ఉన్న గోల్డెన్ ఎగ్స్ ఉంటాయి. ఒక పాము ఈ ఎగ్స్ తింటుంది. ఈ పాము కొన్ని నిర్దిష్ట ఎగ్గులను తినకుండా ఉండేలా చూడాలి. అలా చేస్తే ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ నుంచి రక్షణ పొందుతారు. బిగ్‌బాస్ ప్రేరణను ఐదుగురు కంటెస్టెంట్లను ఎంచుకుని వారి ఫోటోలు ఉన్న గుడ్లను పాము నోటిలో వేయమని ఆదేశించారు. అలా ఆమె విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజలను ఎంచుకున్నారు.
ముందుగా చెప్పుకున్నట్లు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎలిమినేషన్ టాస్క్ మరోసారి ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రేరణ మెగా చీఫ్‌గా ఎంపికైన తర్వాత, ఇతర హౌస్‌మేట్స్ తమ ఇష్టమైన వారి ఎగ్స్ పాము నోటిలో వేశారు. నాబీల్, అవినాష్ యాష్మి గుడ్డును , నిఖిల్, గౌతమ్ తేజ గుడ్డును, విష్ణుప్రియ, పృథ్వీ ప్రేరణ గుడ్డును, రోహిణి, హరితేజ అవినాష్ గుడ్డును ఎంచుకున్నారు. చివరకు, నాబీల్ గుడ్డు మాత్రమే మిగిలిపోయి, ఆయనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభించింది.
ప్రస్తుతం, ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారు గౌతమ్ కృష్ణ, యాష్మి గౌడ, హరితేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ. సోషల్ మీడియా పోల్స్ ప్రకారం, గౌతమ్ కృష్ణ 27% ఓట్లతో అత్యధిక ఓట్లు సాధించారు. నిఖిల్ 26.07% ఓట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ప్రేరణ (17%), యాష్మి (16.32%) ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, విష్ణుప్రియ (11%), పృథ్వి (9%), హరితేజ (6%) ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. హరితేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ, పృథ్వీ కూడా ప్రమాదంలో ఉన్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారేమో చూడాలి.