త్రివిక్రమ్ ఎందుకిలా చేస్తున్నారు..?

NAGARJUNA NAKKA
త్రివిక్రమ్ శ్రీనివాస్ మరీ లేట్ చేస్తున్నారు. హిట్ సినిమాలు అందించే దర్శకుడిగా పేరున్నా.. చాలా నెమ్మదిగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. మెదడుకు పనిపెట్టి.. ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించేలా డైలాగులకు సాన పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చారు కానీ.. అంత వేగంగా ముందుకు సాగడం లేదు. దీంతో ఆడియన్స్ వెయిట్ చేయలేకపోతున్నారు. సినిమా ఆకలితో ఆవురావురుమని చూస్తున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు కేవలం సినిమాలు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌కే పరిమితమవుతున్నాయి. రియాలిటీలో మాత్రం ఈ డైలాగులని ఇంప్లిమెంట్‌ చేసేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు త్రివిక్రమ్. పెండింగ్ ప్రాజెక్ట్స్‌ని క్లియర్ చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ముఖ్యంగా సీనియర్ల సినిమాలని వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉంచుతున్నాడు త్రివిక్రమ్.  

వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించి అయి నాలుగు సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటికీ ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌కి వెళ్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ మధ్యన వెంకీ 75వ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడనే ప్రచారం జరిగింది.

చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో కూడా ఒక సినిమా ప్రకటన వచ్చేసింది. 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని చెప్పాడు చిరు. అయితే ఈ ప్రకటన వచ్చి రెండేళ్లు అవుతున్నా, లాంచింగ్‌ డేట్‌పై క్లారిటీ రావడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ప్రస్తుతం మహేశ్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. 'అతడు, ఖలేజా' తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై మంచి హైప్స్ ఉన్నాయి. అయితే చాలా రోజుల క్రితం అనౌన్స్‌ చేసిన సీనియర్ హీరోల సినిమాలని పక్కనపెట్టి, త్రివిక్రమ్ టాప్‌హీరోలనే ప్రిఫర్ చేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ప్రేక్షకులను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు సంతృప్తి పరుస్తాడో చూద్దాం..ఆయన మాత్రం మంచి ఫుల్ మీల్స్ లాంటి చిత్రంతోనే వస్తారని అందరికీ తెలుసు.

 






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: