బిగ్ బాస్ - 5 : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

Anilkumar
బుల్లితెర తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్  5 లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ మొదలు కాబోతోంది.ప్రస్తుతం హౌజ్ లో 19 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.అందులో 6 మంది నామినేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం హౌజ్ నుండి బయటకి వెళ్ళేది ఎవరు.అసలు ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది.ఒకవేళ ఎలిమినేషన్ అనేది ఎత్తేస్తే ఈసారికి అందరూ బ్రతికిపోయినట్లే.కానీ ఇప్పటికీ జరిగిన నామినేషన్స్ వేడిని చూశాక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కచ్చితంగా ఉండబోతోందని అర్ధమవుతుంది.ఇక ఈసారి ఎలిమినేషన్ కి మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.

అందులో ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ మరియు ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు.మానస్, జస్వంత్,రవి, సరయు, కాజల్ ఆర్ జే, ఇంకా హామీదలు ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్నారు.ప్రస్తుతం వెబ్ సైట్స్, అలాగే పలు యూట్యూబ్ ఛానెల్స్,డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి సంబంధించిన ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే యాంకర్ రవి టాప్ ఓటింగ్ లో ఉన్నాడు.ఇక రవి తర్వాత మానస్,ఆ తర్వాత జస్వంత్,ఆర్ జే కాజల్ లు వరుసగా ఉన్నారు.ఇక ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. వాళ్లే సరయు మరియు హామీద.ఇక హామీద హౌజ్ లో అడుగు పెట్టిన దగ్గరి నుండి కాస్త హుషారుగానే ఉంది.కంటెంట్ కూడా బాగానే క్రియేట్ చేసింది.

ఇక సరయు విషయానికొస్తే..సరయు ఇప్పటివరకు ఎక్కడా కూడా స్క్రీన్ స్పేస్ నని క్రియేట్ చేసుకోలేకపోయింది.ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా వీరిద్దరి మధ్యే ఎలిమినేషన్ ప్రోసెస్ అనేది జరగబోతోంది.అయితే బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో సరయు ఎలిమినేట్ అయ్యి.. హౌజ్ నుండి బయటికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.అయితే సరయు మాత్రం హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నాగార్జున గారితో సీజన్ చివరి వరకు ఆడి.. హౌజ్ లో ఎంతమంది ఉన్నా, అందరి చూపు తన వైపుకు తిప్పుకునేలా చేస్తానని చెప్పింది. అలాంటి సరయు ఇప్పుడు మొదటి వారం ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు చెప్తున్నారు.మరి మొదటి వారం హౌజ్ నుండి బయటికి వెళ్ళేది సరయు నో లేక హామీద నో తెలియాలంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: