సూపర్ స్టార్ రజినీనే.. ఎవరో తెలియదన్న సింగర్ మనో?

praveen
సూపర్ స్టార్ రజినీకాంత్  ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రజనీకాంత్ అటు తమిళ హీరో అయినప్పటికీ తనదైన శైలిలో అలరించి ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా సూపర్ స్టార్ గా మారిపోయాడు.  ప్రస్తుతం ఎంతో మంది యువ హీరోలు వస్తున్న రజనీకాంత్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి.  రజనీకాంత్ సినిమా వస్తుందంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు హిందీ ప్రేక్షకులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తారు.



 అయితే తెలుగులో రజనీకాంత్ సినిమాలకు డబ్బింగ్ చెబుతూ.. అచ్చం రజినీకాంత్ స్టైల్ లో డైలాగులు చెబుతూ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు  సింగర్ మను. ఇక ఎన్నో ఏళ్ల నుంచి తన వాయిస్ తో రజినీకాంత్ ను తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికి కూడా ప్రతి సినిమాలో రజినీకాంత్ కి  మను డబ్బింగ్ చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అలా ఏకంగా రజనీకాంత్ సినిమాలకు డబ్బింగ్ చెప్పే సింగర్ మను ఒక సమయంలో ఏకంగా రజనీకాంత్ ఫోన్ చేస్తే రజినీకాంతా ఎవరు ఏ రజినీకాంత్ అంటూ అడిగి షాక్ ఇచ్చారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సింగర్ మను.



 ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి సింగర్ మను స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా సతీసమేతంగా ఎంట్రీ ఇచ్చిన మను దంపతులకు అటు వ్యాఖ్యాత అలీ బావ చెల్లెలు అంటూ ఎంతో సాదరంగా  ఆహ్వానించారు.  ఇకపోతే చంద్రముఖి సినిమా వచ్చిన సమయంలో  రజనీకాంత్ కి డబ్బింగ్ చెప్పారు సింగర్ మనో. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. రాత్రి పది గంటల తర్వాత తనకి ఒక కాల్ వచ్చిందని.. నేను రజినీకాంత్ ని మాట్లాడుతున్నాను అంటూ అంటూ అవతలి వ్యక్తి అన్నారు. ఇక ఆ సమయంలో రజనీకాంత్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటి అని అనుకొని.. ఏ రజినీకాంత్ అని అడిగాను  అంటూ చెప్పుకొచ్చారు సింగర్ మను. ఇక ఆ తర్వాత  రజనీ కాంత్  ఎక్కడ కోప్పడకుండా మాట్లాడి చంద్రముఖి సినిమాలో అద్భుతంగా డబ్బింగ్ చెప్పావు అంటూ మెచ్చుకున్నారు అని సింగర్ మను గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: