తెలుగు సినిమా పోకడ ను మార్చిన తమిళ సినిమా ఖైదీ..!!

P.Nishanth Kumar
సూర్య తమ్ముడు గా సినిమా పరిశ్రమలోకి వచ్చిన హీరో కార్తీ తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో  మంచి క్రేజ్ తో పాటు మార్కెట్ ను కూడా ఏర్పరుచుకున్నాడు. ఆవారా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తీ ఆ తర్వాత ఎన్నో డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇటీవల కాలంలో ఆయన విభిన్నమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా ఖైదీ అనే మూవీ తో ఆయన వెరైటీ చిత్రాల హీరోగా స్థిరపడి పోయాడు.

హీరోయిన్ అవసరం లేకుండా సినిమా చేసి సూపర్ హిట్ కొట్టొచ్చు అని ఖైదీ చిత్రం ద్వారా నిరూపించాడు. ఓ హత్య కేసులో పదేళ్లు జైలు శిక్షను అనుభవించి తన కూతురును చూడడం కోసం కోటి ఆశలతో జైలు నుంచి బయటకు వస్తాడు. హీరో అలా బయటకు వచ్చే సమయానికి డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతున్న గ్యాంగ్ పోలీసులను చంపడానికి పథకం వేస్తుంది. ఆ పథకం లో హీరో అనుకోకుండా ఎంటర్ అయ్యి ఆ పోలీసులను ఏవిధంగా కాపాడాడు అనేదే సినిమా కథ. ప్రపంచాన్ని కబళిస్తున్న డ్రగ్స్ బారినుంచి  నుంచి తన కూతురు వయస్సున్న పిల్లలను ఏ విధంగా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ.

దర్శకుడు అద్భుతమైన కథను ఎంచుకొని దానికి తగ్గట్లుగా దర్శకత్వం వహించి సూపర్ హిట్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఇటు హీరోకి అటు దర్శకుడి ఇద్దరికీ గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. తెలుగులో ఈ సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. కార్తీకి ఈ దెబ్బతో భారీ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. హీరోయిన్ లేకుండా సినిమా చేసి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఇప్పుడు ఉన్న కమర్షియల్ రోజులలో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ప్రయోగాత్మకంగా సినిమా చేసి ఈ విధంగా హిట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: