పవన్ 30 వ సినిమా ఆయన తోనే..?

Anilkumar
ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్... ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఓ పక్క మలయాళ రీమేక్ అయ్యప్పనున్ కోషియం రీమేక్ అయిన'భీమ్లా నాయక్' షూటింగ్ తో బిజీగా ఉంటూనే..మరోపక్క క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత వరకు పూర్తయింది.ఈ రెండు సినిమాలు 2022 లో రిలీజ్ కి ముస్తాబవుతున్నాయి.ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కానీ..అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని బట్టే ఆ రిలీజ్ డేట్స్ ఫైనల్ అవుతాయి.

ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా పవన్ కళ్యాణ్ తన 28 వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు.అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.దీంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్.అది పవన్ కళ్యాణ్ కి 29 వ సినిమా.ఇక 28,29 సినిమాలు ఇంకా మొదలు కాకముందే పవన్ తన 30 వ సినిమా గురించి ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండ్రస్టీ వర్గాలు అంటున్నాయి.ఇక ఆ వివరాల్లోకి వెళ్తే..పవన్ 30 వ సినిమా తనకు అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయనున్నట్లు తెలుస్తోంది.త్రివిక్రమ్ దగ్గర పవన్ కి సరిగ్గా సూట్ అయ్యే ఓ కథ ఉంది.

దానికి పవన్ కూడా ఓకే చెప్పడం జరిగింది.అయితే దీనిని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనేది త్రివిక్రమ్ ఆలోచనగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' సమర్పణలో 'హారికా హాసిని క్రియేషన్స్ 'వారు ఈ కాంబోని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.అంతేకాదు 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ' వారు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యే అవకాశం ఉందట.ఇక పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'జల్సా' సూపర్ హిట్ అవ్వగా..'ఆ తర్వాత వచ్చిన 'అత్తారింటికి దారేది' మూవీ ఇండ్రస్టీ హిట్ సాధించింది.ఇక ఆ తర్వాత వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన'అజ్ఞాత వాసి' మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.అయినా కూడా వీరి కాంబినేషన్ కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.మొత్తానికి పవన్ 30 సినిమా మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో నే ఉండబోతోందన్నమాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: