క్రిస్మస్ కు తలైవా.. అందరూ పక్కకు వెళ్లాల్సిందే!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో వరుసగా అన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. మరిన్ని సినిమాలు కూడా విడుదల కోసం తమ ప్రయత్నాలు చేయగా తెలుగులో కొన్ని తమిళ సినిమాలు కూడా విడుదల అవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన వాలిమై సినిమా కూడా తెలుగులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు రాబోతుండగా తమిళనాట ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల అవుతుంది. అదే సమయంలో తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు.

 ఆ టైం లో కొన్ని పెద్ద సినిమాలు ఉండడం కొంచెం రిస్క్ అనిపిస్తుంది అయితే తమిళనాడులో విడుదలైన సినిమా తరువాత తెలుగులో విడుదల అయితే దానికి పెద్దగా క్రేజ్ ఉండదు కాబట్టి ఎన్ని కష్టాలు అయినా సరే క్రిస్మస్  కి ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రిస్మస్ కి విడుదల విడుదల అవుతుండటం విశేషం. తెలుగునాట ఈ సినిమా పుష్ప కు పోటీగా రాబోతుంది కాబట్టి అజిత్ పుష్ప ఏ విధంగా పోటీ పడతాడు అనేది చూడాలి. 

మరోవైపు తెలుగులో ఉన్న అజిత్ అభిమానులు తప్పకుండా ఈ సినిమా ఎలాంటి సినిమాని అయినా ఎదుర్కొని హిట్ గా నిలుస్తుంది అని చెప్పుకుంటున్నారు .ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈ చిత్రానికి ఏ విధంగా పోటీ కాదు అని వెల్లడిస్తున్నారు. తెలుగు తమిళ చిత్రాలు ఎప్పుడు కలసి విడుదలైనా మంచి ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది ఈసారి కూడా అదే ఆహ్లాదకరమైన పోటీ ఉండబోతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: